Tricks and Tips

Sunday, December 5, 2021

నిరంతర సాధన

 పరాజయంతో పట్టువిడువక

నిరంతర సాధన ధ్యేయం ఐతే

విజయ సోపానం మన చెంతే...

సద్గతి వరకే ఆ హద్దు

 అనుసరణీయమె అనుకరణ

సద్గతి వరకే ఆ హద్దు 

నక్క వాతలా వద్దే వద్దు....

మూర్ఖత్వం

 అనాలోచిత మూర్ఖత్వం 

జ్ఞానదీపాన్ని చూడలేని

అంధత్వం....

విజయ ఫలాలు

 శక్తి సామర్ధ్యాల్ని నాటేసి 

శ్రమ, శ్రద్ధతో కృషి చేస్తే

విజయ ఫలాలు మనవేగా.....

రేపటి మొక్క

 నమ్మకమనే వేళ్ళూనుకున్న 

రేపటి మొక్కకు పూసేవే

ఆశల పూలు.....

అందమైన ఊతపదం

 సమయం లేదు

అసమర్థతకు అందమైన 

ఊతపదం.....

మనో....రథసారథి

 మనస్సును జయించు

నీ మనోవేగానికి

రథసారథివై.....