Tricks and Tips

Wednesday, October 23, 2013

అన్నీ...... అవే..... కానీ.......వేరు


            స్టేట్స్ లో స్థిరపడిన నేను ఇండియా వచ్చాను. సుమారుగా రెండున్నర దశాబ్దాల తర్వాత అనుకోకుండా నే చదివిన కాలేజీ ముందు నుండి వెళ్తుండగా ఎన్నో జ్ఞాపకాలు..... నన్ను కారుని ముందుకు పోనీయలేదు. నిదానంగా కారు దిగాను. కాలేజీలోకి అడుగుపెట్టాను. అంతే ఓ రకమైన మధురానుభూతితో మనస్సు, శరీరం పులకరించాయి. నిదానంగా చూస్తూ నడుస్తున్నా అటూ, ఇటూ. నా గుండె స్పందన నాకు వినిపిస్తోంది. అదే కాలేజి కానీ బిల్డింగులను ఆధునీకరించారు. అవే తరగతులు కానీ విద్యార్ధులు వేరు. అవే సబ్జెక్ట్స్ కానీ లెక్చరర్లు వేరు. అదే తోట కానీ మొక్కలు వేరు. అదే గ్రౌండ్ కానీ ఆటగాళ్ళు వేరు. అవే గట్లు కానీ కూర్చున్న వాళ్ళు వేరు. అదే క్యాంటీన్ కానీ ఐటమ్స్ వేరు. అవే కబుర్లు కానీ ఫ్రెండ్స్ వేరు. అవే అల్లర్లు కానీ చేసేవారు వేరు. అవే ఎదురుచూపులు కానీ ఆ అమ్మాయి వేరు. అదే లైబ్రరీ కానీ చదువుకుంటున్న వాళ్ళు వేరు. అదే బస్టాప్ కానీ నిలబడిన వారు వేరు. జ్ఞాపకాల్లో కూరుకుపోయిన నేను  ఫోన్ మోగేసరికి ఇలలోకి వచ్చాను. చూస్తే బాబాయి.  వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టి వెనక్కి వెనక్కి చూస్తూ వదల్లేక, తప్పక కన్నీటి పొరతో కారెక్కి ఇంటికెళ్ళాను.
           బాబాయితో మాట్లాడి భోజనం ఐన తర్వాత బీరువా తీసి ఫోటో ఆల్బం తీసాను. నా కాలేజి రోజుల్లో దిగినవి. అవును నావే ఫోటోలు కానీ వేరుగా ఉన్నాయి. అప్పుడు సన్నగా, చలాకీగా,గలగల నవ్వుతో, ఒత్తైన జుట్టుతో అవును.....  చిన్నగా నవ్వుకుంటూ అద్దంలో చూసుకున్నా
అన్నీ......  అవే.......  కానీ.......  వేరు.
                                     **********

4 comments:

  1. అన్నీ ఉన్నాయి అలాగే ఉన్నాయి చెలి ఒకటే కరువైనదీ...., ఈ పాట గుర్తొచ్చింది, దేవీ,రాసిన శైలి బాగుంది, కొంచం పెంచి రాసి ఉంటే బాగుండేది.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీరన్నట్లు,కొంచెం పొడిగించి రాయాలంటే సదరు వ్యక్తి జీవితం నిరాశల్లో కూరుకుపోయి ఇక స్టేట్స్ వెళ్ళే పని ఉండదేమోనని ఆపేశాను ప్రశాంతమైన చోట.

      Delete