అది ఒక పల్లె . ఆ పల్లెలో బడి ఒకటి ఉంది . ఆ బడికి రెండు గదులు ఉన్నాయి . ఆ బడిలో మూడు కుర్చీలు ,నాలుగు బోర్డులు ఉన్నాయి . బడిలోని ఉపాధ్యాయుల సంఖ్య ఐదు . వీరంతా సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజుల పాటు పిల్లలకు పాఠాలు ,ఆటపాటలు చెప్తారు . వేసవికాలం మొదలవగానే ఒంటిపూట బడిని ఏడు గంటలకు తీస్తారు . ఒకటవ తరగతి పిల్లలు ఏడుస్తూ, ఎనిమిది గంటలకు వస్తారు . బడిలో తొమ్మిది రకాల కూరగాయముక్కలతో సాంబారు కాస్తారు . పిల్లలు జట్టుకు పది మంది చొప్పున కూర్చొని భోజనం చేస్తారు .
*******
No comments:
Post a Comment