కమనీయం 'క' గుణింతం
కలం చేత పట్టుకుంటే
కలం చేత పట్టుకుంటే
కాలమన్నది తెలియదంతే
కిలకిలకిల పక్షులరాగాలు
కీచురాళ్ళ వాద్యాలు
కుసుమములపై భ్రమరనాదాలు
కూనలమ్మ పదాలు
కృషీవలుని స్వేదబిందువులు
కౄరమృగదర్పాలూ
కెంపు వన్నెతో సూరీడు
కేరింతల పసిబిడ్డలు
కైమోడ్చిన గోపికలు
కొంటె కృష్ణుని లీలలు
కోయిలమ్మ కుహుకుహులు
కౌలు రైతు కడగండ్లు
కంద పద్యములో కూర్చి కొంత
కఃనీగా రాసి మిగతా, చూసే సరికి తెల్లవారె.
**************
No comments:
Post a Comment