ఓం నమః శివాయ
ఓం నమః శివాయ------- ll 5 ll
పరమేశ్వరా పార్వతీ పరమేశ్వరా
ప్రణమిల్లి మ్రొక్కెద ప్రమధ గణనాధా
ప్రణామములివె నీకు భక్త సులభంకరా
ll ప ll
భువనములోని అందములన్నీ
కాంచగ మాకీ నయనము లొసగిన
జ్యోతిర్లింగా ....... జ్యోతిర్లింగా
నీకిదె
దీపం సమర్పయామి
ll 3 ll
భువిలో విరిసిన సుగంధములన్నీ
ఆఘ్రాణించగ మాకు నాసిక నొసగిన
ఫణిభూషితలింగా ........ ఫణిభూషితలింగా
నీకిదె
ధూపం సమర్పయామి ll 3 ll
ధూపం సమర్పయామి ll 3 ll
పుణ్యక్షేత్ర జేగంటా నాదముల
శ్రవణము సేయగా మాకు కర్ణము లొసగిన
కరుణాకరలింగా....... కరుణాకరలింగా
నీకిదె
పుష్పం సమర్పయామి ll 3 ll
ప్రకృతిలోని భావములన్నీ
వ్యక్తము సేయగా మాకు స్పర్శను ఒసగిన
బిల్వార్చితలింగా......... బిల్వార్చితలింగా నీకిదె
చందనం సమర్పయామి ll 3 ll
నలభీమాదుల షడ్రసోపేతముల
ఆస్వాదించగ మాకు జిహ్వను ఒసగిన
పరమాత్మకలింగా........ పరమాత్మకలింగా
నీకిదె
నైవేద్యం సమర్పయామి ll 3 ll
నైవేద్యం సమర్పయామి ll 3 ll
పంచాక్షరీ నామ మహిమాన్వితముచే
పంచక్రియా జ్ఞానేంద్రియముల మాకొసగిన
మహాప్రాణలింగా....... మహాప్రాణలింగా..... నీకివె
మా ప్రణామములు
ఓం నమః శివాయ------- ll 5 ll
********
ఓం నమః శివాయ!
ReplyDeleteధన్యవాదములు చంద్రగారు.
ReplyDelete