(భారతమాతకు జేజేలు పాట వింటుంటే రాయాలనిపించి రాసిన గీతం)
పల్లవి: ఆంధ్రమాతకు జేజేలు - అమరజీవికి జేజేలు
ఆ తెలంగాణ రాయలసీమ
సమైక్యాంధ్రకు జేజేలు ll ఆంధ్ర ll
చరణం: సమైక్యాంద్రే సమర్ధభూమి
సంపూర్ణతకది సార్ధకభూమి
తెలుగుభాషకై వెలసిన భూమి
తెలుగు తేజము పంచిన భూమి ll ఆంధ్ర ll
చరణం: మన జీవములో మన భావములో
సమైక్యవాదమె నినాదముగా
సమర శంఖారావము సేయుచు
ఐక్యత రాగము నాలాపించెను ll ఆంధ్ర ll
చరణం: శాతవాహనుల శాసనాలు - రెడ్డిరాజుల కట్టడాలు
కాకతి రాజులు - కృష్ణరాయలు
తెలుగు బిడ్డలై - తరియించిన భూమి ll ఆంధ్ర ll
*******
jai samaikyandhra!!!!!...unity is strength.
ReplyDelete