చిలకా.....చిలకా.....చిలకా.....చిలకా.....
చిలిపి చిలుక పిలిచింది
చిక్కులెన్నో తెచ్చింది
చెక్కిలి నొక్కి పోయింది
చక్కిలిగింతలు పెట్టింది
చక్కనిదానా చిక్కనిదానా
ఒంపుల సొంపుల ఓ చిన్నదానా
నా దరికి వస్తావా - నన్నల్లుకు పోతావా
చాటుంది రావేమే - ముద్దులన్నీ తీర్చేనే
ll చి ll
ఒట్టుపెట్టి చెప్పింది
ఒక్కమాట రమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసింది
ఊపిరి తీసుకుపోయింది
టక్కరిదానా టెక్కులదానా
అందాలెన్నో ఉన్నదానా
మనసు నీదే వస్తావా - మాయచేసి పోతావా
తాపం తీర్చి పోరాదా - కాలమంతా నీకేగా
ll చి ll
టక్కున కన్ను కొట్టింది
పెదవిని పంటితో నొక్కింది
హావభావాలిచ్చింది
ఐసులాగా చేసింది
అల్లరిదానా కొంటెదానా
బంగారులేడి వన్నెదానా
అందాలన్నీ యిస్తావా - అలరించి పోతావా
ఆశలన్నీ తీర్చేవా -ఆదమరచి పోయేలా
ll చి ll
ll చి ll
అల్లరిచూపు చూసింది
అల్లుకుపోతా రమ్మంది
మల్లెలు కొలిచి తెచ్చింది
మనసునిట్టే దోచింది మల్లెలు కొలిచి తెచ్చింది
చెక్కిట నొక్కులు ఉన్నదానా
వన్నెల చిన్నెల ఓ చిలిపిదానా
వన్నెల చిన్నెల ఓ చిలిపిదానా
ఆ దరినే నిలిచేవా - నా దరికి రారాదా
నావన్నీ నీవేలే - నన్నల్లుకు పోవేమే
ll చి ll
*********
ll చి ll
*********
వావ్ చిలకా అంటే ఇంకేమో అనుకున్నా...,
ReplyDeleteచిలక, దాని పలుకూ అదిరింది దేవమ్మా..
మీరజ్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.
Delete