Tricks and Tips

Friday, November 1, 2013

అజరామరం అమరజీవి త్యాగం



ఆంధ్రులకై అశువులు బాసి ,ఆశయాలకు తన ఆయువిచ్చి ,
 ఆంధ్రరాష్ట్రం మనకిచ్చి నిష్క్రమించిన అమరజీవీ .... 
నీ త్యాగానికి తుల్యమైనది గలదా అవనిలో... ?
నేటికైనగలరా ... !నీకుసాటి ఇలలో ...?

పదవులకోసం కాదూ ... కాదూ ... 
ప్రజాసేవయే మా ఆశయం  ,
పారదర్శకతయే మా ఆయుధం
అంటూంటారు ఆశువుగా .... అంటూనే 

అమరజీవి ఆశయాలకు తిలోదకాలిస్తూ ,
ఆంధ్రరాష్ట్ర విచ్చిన్నతను ఆహ్వానిస్తూ ,
మౌనం అర్ధంగీకారం అనిపిస్తూ ,
పారదర్శకతను పాతివేస్తూ ... 

ఆంధ్రుల సంకట కంటకాలను 
పూదండల మాటున దాచిపెట్టి ,
నిన్నలంకరించ వచ్చిన వీరి
  అంతర్వాణికి భరతవాక్యం 
పలికించే భరతుడు రావాలని ఆశిస్తూ ... 

అమరజీవి  పొట్టి శ్రీరాములు 
అమర్ రహే ....... 

********


2 comments: