చెలియ నవ్వు చూసి.....
చెదరిపోయె మనసే,
కలువ కళ్ళు చూసి .....
కరిగిపోయె వయసే ,
నా కనులకు వేసెనే గాలం - నా నిదురకు చెల్లెనే కాలం
చెలియ కురులు చూసి ....
విరులు తురుమ తోచె ,
పెదవి విరుపు చూసి ....
పలుకరించ తోచె ,
నా మనసే చేసెనె మారాం - నా వయసే వదలదే గారాం
చెక్కిలి నొక్కులు చూసి...
మెత్తగ నిమర తోచె ,
మేని వంపులు చూసి ...
వీణలా మీటగ తోచె ,
నా వలపుకు నీవే మూలం - నా తలపుకు వేయకె తాళం
చెలియ పలుకు వింటే ....
పలవరించె పెదవే ,
చేయి చాచి పిలువ ....
పులకరించె తనువే ,
నా కలలకు నీవే తీరం - నా చెలిమికి కాకే దూరం
*********
evadi maata nammaku ,thvaragaa intiki veellu
ReplyDeleteAmdaroo meelaa unite
ReplyDeletesamaajam enta baagumtumdi.
Any how thank you.