నవ్వరా నాన్నా ! నవ్వు
నవ్వరా కన్నా ! నవ్వు
నవ్వరా చిట్టీ ! నవ్వు
నవ్వరా బుజ్జీ ! నవ్వు
మనసారా నవ్వు ,
ఎంతసేపైనా నవ్వు ,
ఏ సమయంలోనైనా నవ్వు ,
అలసిపోయేవరకూ నవ్వు ,
హాయిగా నవ్వు ,
ఆనందంగా నవ్వు .
ఉష్ !నీకో రహస్యం చెప్పనా ?
నిను కవ్వించి , నవ్వించిన
నీ తల్లిదండ్రులే నీ నవ్వును
నీకు చేస్తారు.... దూరం !
నీ నవ్వులను ఇక రెండేళ్ళలో
పంపించేస్తారు...సుదూరం !
K.G నుండి P.G వరకూ
గ్రేడులు , ర్యాంకులు ఏవేవంటూ
రుసరుసలాడుతూ ఉంటారు ,
బుసలు కొడుతూ చూస్తారు .
సినిమా , సరదాలన్నావో!
సాధించిందేమిటి ? అంటారు .
ఆదివారం అన్నావో !
అందరూ .. చూడు .. అంటారు .
జ్వరమో , జలుబో వస్తేను
టాబ్లెట్ వేసి ,స్వెట్టర్ వేసి ,
చేతికి పుస్తకం ఇస్తారు .
నిద్దరపోతే తట్టి లేపి ,
గత మార్కులను చూపెడతారు .
టి . వి , నెట్ అన్నావో !
నివ్వెరపోతూ...చూస్తారు .
ఆటలు ,పాటలు అన్నావో !
హవ్వ ... హవ్వ ... అంటారు .
విందులు ,వినోదాలు అన్నావో !
విస్తుపోతూ...చూస్తారు .
విందులు ,వినోదాలు అన్నావో !
విస్తుపోతూ...చూస్తారు .
సమయం పోతే రాదంటూ ,
చెవిలో రొదలే పెడతారు .
కాలం విలువ తెలిపేస్తూ ,
కటువుగా ప్రవర్తిస్తారు .
ఎందుకిలా ? అన్నావో !
అంతా...నీకొరకంటారు .
ఇంక అప్పుడేం నవ్వుతావ్ ?
ఎలా నవ్వగలుగుతావ్ ?
అందుకే...అందుకే ...
అందుకే నాన్నా ! ఇప్పుడే
మనసారా నవ్వు ...హాయిగా నవ్వు ...
*******
baalyam amtaa aanamdo brahma ,peddayyaka govindo haaa....
ReplyDelete