పిల్లవాడు జన్మించాడా ...... ! అంతే
సంస్కృతిని తోసుకుంటూ ,
విష సంస్కృతి ఒక్క ఉదుటున
జటలు విప్పి విజ్రుంభించి...
అమ్మ జోలపాట కన్నా
సెల్ పాట మంచిదంది ,
పెరటి తోట షికారు కన్నా
బైక్ షికారు మంచిదంది ,
కొండపల్లి బొమ్మ కన్నా
ప్లాస్టిక్ బొమ్మ మంచిదంది ,
రామనామ జపం కన్నా
కెవ్వుకేక మంచిదంది ,
రంగు బొమ్మల పుస్తకం కన్నా
టి . వి బొమ్మలు మంచివంది ,
మట్టి కుండ నీరు కన్నా
ఫ్రిజ్ నీరు మంచిదంది .
సంస్కృతి చేరుకుని చూసేసరికి ...
తల్లిదండ్రులు మురిసిపోతూ ,
తప్పెట్లు కొడుతుంటే ,
విష సంస్కృతి అది చూసి
వికటాట్టహాసం చేసింది .
*****
kalmashamerugani pillavaadikee kaalushyatappadu ........?
ReplyDeleteTry to avoid to some extent.
ReplyDeleteఇన్ని నేర్పిన వారికి రోడ్డు మీద ఎలా బ్రతకాలో వాడు నేర్పుతాడు
ReplyDeleteమానవత్వ కాలుష్యానికి అది పరాకాష్ట.......
Delete