నీ పై అలిగిన నేను
చల్లగాలిలో పరవశించాలనీ ,
చందమామతో ముచ్చటించాలనీ ,
దరహిస్తున్న అరవిరిసిన
విరికన్నెలను పలకరించాలని ,
పున్నమి వెన్నెల
పానుపుపై పరుండాలనీ ,
సుగంధ పరిమళభరితమైన
పారిజాత విరివానలో సేదతీరాలనీ ,
నే చేసిన ప్రయత్నమంతా వృధా
ఏదో వెలితి ........ ,
నా మనసు నా దగ్గర లేకపోవడమే
ఏదీ ? ఏమైపోయింది ?
నీ జతలో తీయదనాన్ని అనుభవిస్తూ ,
నీ వెచ్చని ఒడిలో మైమరచిపోతూ ,
చల్లని నీ చేతి స్పర్శతో పులకించిపోతూ ,
నను మురిపించి , మరపించే
ముచ్చటైన నీ ముద్దులలో మునిగి తేలుతూ ,
మృదుమధురమైన నీ ప్రియ సంభాషణను ఆలకిస్తూ ,
నీ గుండె చప్పుళ్ళు వింటూ పరవశిస్తూ ,
నీ గుండె గూటిలో గువ్వలా ఒదిగి
సేదతీరడానికి నీ చుట్టూ పరిభ్రమిస్తోంది ..........
చేసేదేముంది ?
నేనూ నీ దరి చేరుతున్నా
జీవనమాధురి చవి చూసేందుకు
నీ పై తీరిన అలకతో .
*****************
మనసు గతి ఇంతే...,
ReplyDeleteమరి వదిలేస్తే ఎలా, అయినవారితోనే అన్నీ .. ఆనందాలు
నిజమే మీ భావంతో నేను ఏకీభవిస్తాను మీరజ్ , ధన్యవాదాములు .
Delete