Tricks and Tips

Wednesday, October 30, 2013

ఆమె సుకుమారమైనది

నిన్న కూడా నాతో తిరిగిన నా స్నేహితురాలు చనిపోయిందనే వార్తతో కుప్పకూలిపోయాను . ఆమె గూర్చిన ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి . ఆమె ఎంతో  సుకుమారమైనది . కొంచెం చలికి ,చిన్న ఎండకి, చిరు జల్లులకు కూడా తట్టుకోలేక పోయేది . పొయ్యి సెగను భరించలేదు ,చాపపై పడుకోలేదు ,నేలపై పడుకోలేదు ,బురద అంటే చిరాకు ,మురికి అంటే అసహ్యం . రకరకాలుగా  అలంకరించుకోవడమంటే ఇష్టం ,రంగురంగుల దుస్తులు, చెరగని చిరునవ్వులుతో కళకళలాడే ముఖం గుర్తొచ్చి ఒక్క ఉదుటున లేచి వాళ్ళింటికి వెళ్ళాను . ఆమెను ఫ్రీజర్ బాక్స్ లో పెట్టారు . గంట తర్వాత బయటకు తీసి రోడ్డు మీద మురికికాల్వ ప్రక్కన ఎర్రటి ఎండలో పెట్టి చన్నీటితో స్నానం చేయించారు . అంతా బురద , అక్కడే కర్రలతో కట్టిన పాడె పైన చాప పరిచి దానిపై ఆమెను పడుకోపెట్టి చాపను చుట్టారు . తెల్లని గుడ్డను కప్పి తీసుకువెళ్ళారు . చితికి నిప్పంటించారు . ఇంత జరుగుతున్నా ఆ ముఖంలో ప్రశాంతత ఏమాత్రం చెక్కు చెదరలేదు . జీవం ఉన్నప్పుడు అన్నీ తనకి ఇష్టమయిన పనులే చేసుకున్నప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా లేదు . నిన్నటికి ఈ రోజుకి ఉన్న చిన్న తేడా ,అప్పుడు జీవుడు లోపల ... ఇప్పుడు బయట....  అంతే కదా జీవితం అనుకుంటూ ఇంటికి బయలుదేరాను బరువెక్కిన గుండెతో .

********

5 comments:

  1. nijame... pidikedu gunde aadithe jeevitham aagithe budida :-(

    ReplyDelete
  2. జీవిత సత్యం ,ఎప్పటికైనా అంగీకరించాల్సిన సత్యమే ఇది.
    ఏమి పొందుతున్నామో,ఏమి పోగొట్టుకున్నామో... తెలిసేలొగా జీవితం ముగుస్తుంది,
    ఈ మద్యలోనే మిద్యలన్నీ..,
    చక్కటి పోస్ట్ దేవీ.

    ReplyDelete
    Replies
    1. ఆ మిధ్యలే వాస్తవాలనే భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం,మీరజ్ మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete
  3. జీవితపు చరమ నిక్షిప్త తృప్తి
    బహుశా జీవితపు సమాప్తి లోనే ఉందేమో
    మధ్య లోని మిధ్య లో వధ్య శిల్పాలుగా
    మనల్ని మనం వంచించుకుని
    తృప్తి పడుతున్నామేమో
    వేదాంతానికి ఒక అడుగు ముందుకు
    వేసినట్లుంది శ్రీదేవిగారు

    ReplyDelete
    Replies
    1. జానీగారు,మీరే చాలా వివరంగా చెప్పారు. మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete