Tricks and Tips

Sunday, April 27, 2014

అమ్మా ! నీ ఆశ్రయం ....

అణువుగ నీ గర్భాన్ని ఆశ్రయించి ,
జన్మించి నీ ఒడిని ఆశ్రయించి ,

ఆకలిగొని నీ పాలధారను ఆశ్రయించి ,
నిదురించుటకై నీ గుండెలను ఆశ్రయించి ,

ఆటలలో ఊయలగా నీ పాదాలను ఆశ్రయించి ,
గుర్రం ఆటను ఆడుకొనగ నీ మోకాళ్ళను ఆశ్రయించి ,

ఉప్పు ఆటను ఆడుకొనగ నీ వీపుని ఆశ్రయించి ,
ఏనుగు ఆటను ఆడుకొనగ నీ భుజములను ఆశ్రయించి ,

ఆటలలో అలసి నీ పొట్టనే తలగడగా ఆశ్రయించి ,
ఎత్తుకొమ్మని చేతులిస్తూ నీ  చంకలోన ఆశ్రయించి ,

తమ బిడ్డగ నీ హృదయాన్ని ఆశ్రయించి ,
తమ తోడిదే లోకంగా నీ కన్నులను ఆశ్రయించి ,

తమ బంగరు భవితకు రూపంగా నీ ఆలోచ
లో ఆశ్రయించి ,
నీ శ్రమ ,
శ్రయాలతో ఆశయసిద్ధిని పొందిన పిల్లలు.....

తమ రెక్కల ఆశ్రయం నీకివ్వకనే ,
నిను నిరాశ్రయురాలిని చేసారా తల్లీ !!!!
 
********

Saturday, April 26, 2014

హవ్వ ! రామరాజ్యమంట..!!!!!!!!

పార్టీ టిక్కెట్ దొరకగానే ,
వాగ్ధానాలు చేసేవాళ్ళు...

ఓటరన్నను వే(వెం)టాడుతూ ,
వరాల వర్షం కురిపించేవాళ్ళు...

ఎన్నికల్లో గెలుపు కొరకు ,
నోట్లు , సారా పంచేవాళ్ళు...

అధికారం దక్కగానే ,
కుంభకోణం చేసేవాళ్ళు...

ప్రజాసేవ పేరుతో ,
వేల కోట్లు దోచేవాళ్ళు...

పదవి మీద కాంక్షతో ,
నైతికతను మరచినోళ్ళు...

రాజకీయ లబ్ధి కోసం ,
పార్టీలు మార్చేవాళ్ళు...

ఎవరికివారే తమను తాము ,
ఉత్తమోత్తములమంటు గురివింద చందాన...

రామరాజ్యం తెస్తారంట ,
హవ్వ ! రామరాజ్యమంటే తెలుసా వీరికి...?

(నానమ్మా ! మరప్పుడు హనుమంతుడు కూడా వస్తాడా మరి...?)

హనుమంతుడు గద తీసి ,
మోదడం మొదలెడితే...

గ్రాఫిక్స్ తో పనిలేదు ,
గాలిలోకి ఎగురుతారు.....
 
****

 

Thursday, April 24, 2014

నన్నల్లుకుపోయి నవ్వాయి........

ఆ మింటి తారలు నాకై ,
మా పూపొదరింటిలో కొలువై మురిసి.....

సాయంసంధ్యలో విరిసి ,
రాతిరి అంతా మెరిసి ,
చూపరులను మైమరపించి ,
సమ్మోహన ధరహాసము చేసి ,

సుమసౌరభములను కురిపించి ,
సుగంధములతో మత్తెక్కించి ,
సున్నితభావం కదిలించి ,
సుకుమారంగా కరిగించి ,

వేకువఝామున కదిలొచ్చి ,

అల్లనమెల్లన దిగి వచ్చి ,

కలత నిద్దురలో కవ్వించి ,
సవ్వడి సేయక నా శయ్యను చేరి ,
సుతిమెత్తగ న
ను తాకాయి ,
చిలిపిగ నన్నల్లుకుపోయి నవ్వాయి .
***********

Wednesday, April 23, 2014

నాకై విరిసిన....... నీ కోపం

నా ఎంపిక చూసి ఊరూవాడా
వేనోళ్ళతో నను కొనియాడ
నీ చిరునవ్వును చూసి మనువాడా
నా జీవితమాయెను విరివాడ......

విరిసీ విరియని నవ్వులు దాటి
నీ చిరుకోపం ముందడుగేయగ
నా ఆలోచనలు సంధిగ్ధావస్థతతో
సతమవుతూ సంధిని చేయగ.....

నా జ్ఞానజ్యోతి కాంతులలో
నిశితంగా చూశా......ఆ కోపాన్ని
నాకై విరిసిన నీ కోపం
నాపై నీ ప్రేమకు ప్రతిరూపం.......

నా సమయపాలనారాహిత్యానికి ఆవేదనతో
ప్రేమతో కూడిన నీ కోపం.....
నా అనారోగ్యానికి ఆందోళనతో
నా
కై విరిసిన నీ కోపం.........

నీ చిరునవ్వుల విరివానలో
అలసట మరచి నిదురించా.....
నాకై విరిసిన నీ కోపంలో
 నీ ప్రేమను చూస్తూ ఇహమును మరిచా.......

***********

Tuesday, April 22, 2014

నా నిశ్శబ్ధ నీరాజనం...._/\_

నా స్తబ్ధ ప్రపంచంలోనికి చిరుగాలిలా
చొచ్చుకుని వచ్చిన శబ్ధానివి ,

నా నిశ్శబ్ధాన్ని తెరలా మెల్లగా
ప్రక్కకు తొలగించిన సుశ్శబ్ధానివి ,

నీ చిరునవ్వులతో కూడిన శబ్ధం ,
నీ చిరుమువ్వలతో కూడిన శబ్ధం ,
నీ చేతి గాజులతో కూడిన శబ్ధం ,
నీ చిలుక పలుకులతో కూడిన శబ్ధం ,

నీ చిరు అలకలతో కూడిన శబ్ధం ,
నీ చిరు వలపులతో కూడిన శబ్ధం ,
నీ చిరు మందలింపులతో కూడిన శబ్ధం ,
నీ చిరు బెదిరింపులతో కూడిన శబ్ధం ,

నీ కూనిరాగాలతో కూడిన శబ్ధం ,
నీ వీణానాదాలతో కూడిన శబ్ధం ,

శబ్ధానికి ఓ మధుర నిర్వచనమిచ్చి ,
శబ్ధానికి ఓ సుస్వరాన్ని స్వర పరచి ,
ఆ శబ్ధతరంగాలు నాలో అలలై కదలగ ,
ఆ సుశ్శబ్ధాలకు నను రాజును చేసిన.....

ఓ శబ్ధార్ధాలంకృత శిరోమణీ ,
నీ సుశ్శబ్ధాలకిదే నా నిశ్శబ్ధ నీరాజనం .

**********


Monday, April 21, 2014

రేరాజుకు నే చేరువయ్యా........


మెరుపుల బోయిలు వచ్చిరి నాకై ,
మబ్బుల పల్లకి తెచ్చిరి నాకై ,
ఆనందతాండవమాడగ మనసు ,
ఆ తారా తీరం చేరుకున్నా........

తారలు బారులు తీరిరి నాకై ,
తళతళ తళుకులు కురిపించిరి నాపై ,
సంబరమంబరమంటగ మదిలో ,
ఆ నెలరాజుకై నా కన్నులు వెతికే......

వెన్నెల కిరణం కుశలం అడుగగ ,
చల్లని తెమ్మెర దాహం ఇవ్వగ ,
అలజడి అలలుగ కదలగ హృదిలో ,
రేరాజుకు నే చేరువయ్యా........

******

Saturday, April 19, 2014

మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా ....

 మావ  :  ఏటే రంగీ ఆకాశంలోకి సూత్తన్నావ్..... 
 రంగి   :  ఆ సెందురుణ్ణి , సుక్కల్ని సూత్తన్నా మావా   
 మావ  :  నా కంటే బాగున్నాడేటే ఆ సెందురుడు.........
రంగి    :  ఏం సెప్పను మావా............
మావ  :  ఏదోటి సెప్పవే పిల్లా..............

మందు నీవు తాగకుంటే ,ఓ మావా
మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
ఏ....మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా


ఆ సుక్కలన్ని నావైతే ,ఓ పిల్లా
మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా
నే....మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా

 

మారుమనువు అనకుంటే ,ఓ మావా
సీరామ
సెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సీరామ
సెందురుడు నువ్వు ,ఓ మావా

మల్లీ కట్నం తీసుకురాయే ,ఓ పిల్లా
మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా
నాకు....మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా

 

అసత్తెం నీవు పలకకుంటే ,ఓ మావా
సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా

 

అసత్తెమన్నది పలకకుంటే ,ఓ పిల్లా
సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా
ఆ....సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా


ఎడ్డెం అంటే తెడ్డేం అంటవ్ ,ఓ మావా
నీతో నేను ఏగలేను ,ఓ మావా
నిన్నొగ్గేసి పోతున్నాను ,ఓ మావా


సిలిపితనం తెలీకుండా ,ఓ పిల్లా
సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా
ఓ.....సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా


సీ.....పో....మావా
ఏటే....మల్లీ సెప్పవే పిల్లా

మచ్చలేని సెందురుడు నువ్వు ,
మావా
నా సక్కనీ సుక్క నువ్వు
,ఓ పిల్లా
నా 
సెందురుడు నువ్వేలే ,ఓ మావా
నా సుక్కవు నువ్వేలే ,ఓ పిల్లా

******

Friday, April 18, 2014

వారినే చూస్తున్నా నే చేష్టలుడిగి.....


 సమైక్యాంధ్ర మన నినాదమని ,
సమైక్యతే మన విధానమని ,

రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి ,
కాలేజీలు మూసివేసి ,
విద్యార్ధులను రెచ్చగొట్టి ,
ఉద్యమమని ఊదరేసి ,

పోలీసుల లాఠీలకు
విద్యార్ధులు బలైపోతే ,
కటకటాల వెనుక వారు
చీకటిలో మగ్గుతుంటే ,

భవిష్యత్తు మీదంటూ
బల్లగుద్ది చెప్పినోడు ,
అధిష్టానం కుట్రలంటు....
వారి సంగతి విడచి పెట్టి ,

అధిష్టానం దిష్టిబొమ్మలు ,
ఆర్డరిచ్చి తెప్పించి ,
కాళ్ళతో తొక్కించి ,
చెప్పులతో కొట్టించి ,

తుదకు కొరివి పెట్టించి ,
వా
డికి గుండు కూడా గీయించి ,
అల్లకల్లోలాలు సృష్టించి ,
అతిశయాలు వల్లించి ,

నడివీధిలోన అరాచకాలను
దునుమాడే యోధుడిలా ,
మైకు చేత పట్టుకుని ,
పూనకంతో ఊగిపోయి ,

నలుగురిలో మారుమ్రోగి ,
నాలుగు డబ్బులు విసిరివేసి ,
నిరుపేదల జీవితాలను ,
నిస్సిగ్గుగ వాడుకుని ,

వారి కంటి దీపాలను...
కర్కశంగా ఊదివేసి ,
అమరవీరులు మీ బిడ్డలంటూ ,
అతిగ నీవు వాగుతుంటే ,

అమాయకులు తమ బిడ్డలకు
తామే జోహారులర్పిస్తూ ,
నీకు జేజేలు కొడుతుంటే ,
వికృతంగ మనసులోన నీవు....

వికటాట్టహాసం చేసుకుంటూ ,
ఏ . సి చాంబరులో దూరి ,
రాజకీయ మంతనాలు జరిపి నీవు ,
మున్ముందున్న రోజులన్నీ మనవేనంటూ ,

మరో మారు మైకు పట్టి పూనకంతో ,
ఊగిపోతూ గీపెట్టి చెప్పినావు...
M.L.A / M.P టిక్కెట్టు దక్కినదంటూ ,
ప్లేటు ఫిరాయించి వేసి ,

నీవు దుమ్మెత్తి పోసిన ధిష్టానం  ,  
ఏం చేసినా లోకకల్యాణార్ధమే అంటూ ,
వినమ్రంగ చేతులెత్తి ,
అధిష్టానానికి వంగి  మ్రొక్కి ,

ఆ పార్టీ తరుపున నీవు బరిలోకి దిగుతుంటే ,
అమాయకులైన ప్రజలు తిరిగి ,
అన్నా ! నీకే మా ఓటన్నా అంటూ ,
నీ చుట్టూ భజన చేస్తుంటే ,

అయ్యో ! వీరి మత్తు వదలదా....? అనుకుంటూ....
అసహాయంగా వారినే చూస్తున్నా నే చేష్టలుడిగి.....

(మా ప్రక్క నియోజకవర్గంలో ఓ రాజకీయ నాయకుని కొడుకుకు ఇలానే టిక్కెట్ వచ్చింది )

 ******




 

Wednesday, April 16, 2014

ఆత్మావలోకనం.................

నిన్నటివరకు
నీవే నేను , నేనే నీవు
నీకై నేను , నాకై నీవు
నీలో నేను , నాలో నీవు

ఆశ , శ్వాస ఒకటై ,
ఆశయాలు ఒకటై ,
కలలు ఇలలో ఒకటై ,
కళకళలాడుతు కలిసుండే మనము....

ఎందుకు ? ఎందుకు ?
ఎందుకిలా ఎడ , పెడ ముఖాలు ?
 
ఆడంబరాలను ఆశ్రయించి ,
ఆత్మవిమర్శలు మరచిపోయి ,
ఆత్మవంచన చేసుకుని ,
ఆధిపత్యపోరులో పావులమై ,

వివేకం నుండి అవివేకానికి ,
జ్ఞానం నుండి అజ్ఞానానికి ,
అథః పాతాళానికి జారిపోయి.... 

 అలుపుసొలుపు మరచి మనము ,
ఆరోపణల పర్వతాన్నే
అధిరోహించాం అవలీలగా ,
 
ఆఖరిసారిగ
 
మన కనులు కనులు కలవగనే ,
మన కలలు కళ్ళలో కదలాడి ,
ఇలలోకొచ్చి పరికిస్తే........
లోయల అంచున నిలుచున్నాం . 

ఆత్మావలోకనం చేసుకుని ,
మనసును మనసు హత్తుకుని ,
చేతిలో చేయి పట్టుకుని ,
అడుగులో అడుగు వేసుకుని ,
అన్నీ ఒకటిగ చేసుకుని ,
ఆనందభాష్పాలు తుడుచుకుని ,
ఆదర్శ జంట అవుదాము .

*******
 

Monday, April 14, 2014

"అమ్మ"కు అర్ధం..............

నీ ఆలోచనల ప్రాకారములో ,
మన జీవనవన  సుమసౌరభాలు
నిత్య వసంతముగా అలరారాలని ,
నేనల్లుకున్న ఆశలతీవెలు
సాగుతు నా పొదరిల్లల్లగ......

నా గర్భములోని నీ ఆకారముతో ,
మన జీవితాశయ లక్ష్యాలను ,
నిత్యనూతనముగ వివరించాలని ,
నే కన్న కలలను సాకారము చేసే
కమనీయ కథలను వినిపిస్తుండగ......

నీవు విలాసాల మత్తులో మునిగి తేలుతూ ,
మమకారపు విలువలు మరచిపోయి ,
వేరేదో సౌఖ్యం వెదికే వెర్రితో ,
వెంపర్లాడుతు మమ్ము విడచిపోయిన నీకు ,
నీవు పోగొట్టుకున్నదేమిటో తెలియచెప్పనా.....

నీ తల్లి ప్రతిబింబంలా కిలకిలలాడే పాపాయిని ,
"నాన్నా" అని నోరారా పిలిచే పిలుపులను ,
నీకై వెతికే మిలమిలలాడే కన్నులను ,
నువ్వు చెప్పే ఊసులకు ఊకొట్టే బుల్లి పెదవులను ,
నీ గుండెల్లో దూరి ఊకొడుతూ బజ్జొనే బుజ్జాయిని.......

 

ఇంతకు మించి నీవు పొందినదేమైన ఉందా....?
నీ వెంపర్లాటకు ఫలితం ఉందా....?
నీ జీవితానికి ఓ అర్ధం ఉందా....?
కన్నతల్లిగ ప్రేమను పంచి
"అమ్మ"కు అర్ధం నేనయ్యాను ,
నా జీవిత పరమార్ధం నెరవేర్చగ ,
నడుముకట్టి నే బయలుదేరాను .


*******

మా మంచి అమ్మవు నువ్వమ్మా......

 ఆకలి అమ్మా ! అంటే నన్ను ,
జోకొట్టి బజ్జోపెట్టావ్.........

అమ్మా ! నను బజ్జోపెట్టి ,
నీవు ఎక్కడికెళ్ళిపోయావు.....?

అన్నం నాకు వద్దమ్మా ,
ఆకలి...అననే అననమ్మా.....

నువ్వు నాతో ఉంటే చాలు ,
నా వేలు పట్టుకుంటే చాలు....

బూచోడొస్తే నాకు భయము ,
చీకటి పడితే ఇంకా భయము....

నిన్ను వదిలి నే ఉండనమ్మా ,
నన్ను వదిలి నీవు పోవద్దమ్మా.....

నీ కొంగులో నన్ను కట్టుకో అమ్మా ,
నీ ఒడిలో నన్ను పెట్టుకో అమ్మా.......

నీ మెడలో తా(ళి)డు పట్టుకుని ,
నే నోటిలో వేలు పెట్టుకుని...

హాయగ నేను బజ్జుంటా ,
అన్నం నాకు వద్దంటా.....

మంచినీళ్ళు చాలమ్మా ,
మా మంచి అమ్మవు నువ్వమ్మా......

********

Sunday, April 13, 2014

దోబూచులాడగ నాతో నీవు........

నీ కొరకే నే వచ్చానంటూ ,
నా మనసును దోచిన దొంగవు నీవు .

దోబూచులాడగ నాతో నీవు ,
దొరబాబులా వచ్చేస్తావు .

చిరునవ్వుల వరములునీయగ నాకు ,
చిలిపిగ చెంతకు పిలిచేస్తావు .

వీడని నీడలా తోడుంటానంటూ ,
నా చేతిలో ఒట్టు పెట్టేస్తావు .

కనురెప్పలు వేయక చూస్తూ నన్ను,
హాయిగ జోలను పాడేస్తావు .

ఆదమరచి నే నిదురించగనే ,
నను ఒంటరి చేసి పోతావు .

కలత నిద్దురలో నే కదలగనే ,
చిరుగాలితో నను ఏమారుస్తావు .

కనులు తెరిచి నే చూడగనే ,
కలలా కరిగిపోతావు .

మాయ ముచ్చట్లతో నను మోసపుచ్చి ,
దొంగలా పారిపోతావు .

అందుకే......

దొరబాబుల నీవు వేంచేయగనే ,
దొరసానిలా నీ ఒడి చేరుకుని ,

నీ ఒట్టును నిజమే చేయగ నేను ,
ఈ రాతిరి తోడుగ ఒచ్చేసాను ,


అందాల ఓ చందమామ ,
నీ చల్లని వెన్నెల నేనే మామా....

********

ప్రజాస్వామ్య ప్రభుత్వం.....!!!!


నాకు నిన్న ఎలక్షన్ డ్యూటీలో ఒక గొప్ప విషయం తెలిసింది.నేను గుర్తింపు కార్డులు చూస్తున్నాను. ఒక వ్యక్తి ఏ గుర్తింపు కార్డు లేకుండా వచ్చాడు ఒంటిగంట సమయంలో.బాబూ! ఏదో ఒక గుర్తింపుకార్డు తీసుకురావాలి కదా, అన్నాను .ఆ వ్యక్తి "మా ఇల్లు కాలిపోయిందండి" అన్నాడు.నేను వెంటనే ఏజెంట్ల వైపు చూశాను.వారంతా ఇల్లు కాలిపోవడం నిజమే అన్నారు.కానీ అతన్ని ఓటు వేయించడానికి మెజారిటీ ఏజెంట్లు ఒప్పుకోలేదు .సాయంత్రం అయిదింటి వరకు భోజనం చేయకుండా అక్కడే ఉన్నాడు.బ్రతిమాలిన ఊరిలోవారే ఒప్పుకోకపోవడం చూసి నాకు నిజంగా చాలా బాధనిపించింది. ఆ పేదవాడి కళ్ళలోని ఆవేదన , నిస్సహాయత............ ఓటరు గుర్తింపు స్లిప్పులను ఫోటోతో సహా  ఇచ్చి ప్రభుత్వమే ,ఆ స్లిప్పు కాకుండా మళ్ళీ మరో గుర్తింపుకార్డు తెమ్మంటే, ఇల్లు కాలిపోయిన నేను ఎక్కడి నుండి తెస్తానండీ... అని దీనంగా అడుగుతుంటే  ...................ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పేదవానికి ఓటుహక్కు వినియోగించుకునే అర్హత కూడా లేదన్నమాట అనుకున్నాను, నేనూ నిస్సహాయంగా. 
( ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కడు ఓటు వేసిన తర్వాత వచ్చిన గెలుపే నిజమైన " విజయం ")

Wednesday, April 9, 2014

మళ్ళీ కథ మొదలవుతోంది...........

ఓటరు మహాశయులు మీరేనంటూ ,
మా ఓటరు దేవుళ్ళు మీరేనంటూ ,
మీ ఓటెంతో పవిత్రమంటూ ,
మీ నిర్ణయమే విలువైనదంటూ ,


"రాజకీయశక్తి "కి రూపం నేనేనంటూ ,
అరాచకాన్ని అణిచివేయగ వచ్చానంటూ ,
మైకులో హోరుగ చెప్పిస్తూ ,
జోరుగ ఊరిలో తిరిగేస్తూ ,

మా పార్టీకే మీ ఓటంటూ ,
గుమ్మం , గుమ్మం ఎక్కి దిగుతూ ,
చిన్నాపెద్దా తేడా చూపక ,
చేతులెత్తి దణ్ణం పెడుతూ ,

మురికివీధులను దాటుకుంటూ ,
కాలినడకన చకచక వెడుతూ ,
చెమట , సొల్లు ఫర్లేదంటూ ,
చేతులు , తలలు తాకి వెడుతూ ,

నడుమును పూర్తిగ వంచివేస్తూ ,
పూరిగుడెసెలోకి దూరి వెడుతూ ,
మోకాళ్ళు వంచి పీటపై కూర్చుని ,
వృద్ధుని వివరాలన్నీ అడిగి వెడుతూ ,

అంతటి వాడు మన చెంతకు వచ్చాడంటూ ,
సంబరంతో అందరు ఎగురుతు వుంటే ,
వారి బలహీనతను బలముగ పొంది ,
వారి ఓట్లతో గెలుపును పొంది ,

అతివినయంగా అందరికీ చేతులెత్తి దణ్ణం పెట్టి ,
మీకిచ్చిన వాగ్ధానాలన్ని చూడండి ఇదిగో ,
ఇప్పటి నుండే మొదలెడతానంటూ లోనికెళ్ళి ,
మాంత్రికునిలా....... మాయమైపోయాడు ,

రైతుల కన్నీళ్ళు ఆగనేలేదు ,
మగ్గం చావులు తగ్గనేలేదు ,
ఋణాల మాఫీ మాటేలేదు ,
పెన్షన్లు పెంచిన జాడే లేదు ,

వికలాంగుల వినతికి విలువేలేదు ,
ధరలు కిందికి దిగిరాలేదు ,
రోడ్లు , కాల్వలకు దిక్కేలేదు ,
నిరుద్యోగుల నిస్పృహలకు అంతమేలేదు ,

బాధలు ఏకరువెడదామని వెళితే ,
ఏ.సి నుండి బయటకు రాడు ,
వెళ్ళిన వారిని లోనికి పిలవడు ,
అప్పటీ ఇప్పటికీ పోలిక లేదు ,

"అరాచకకుయుక్తి" రూపం చూపి ,
విలాసంగా కుర్చీలో అటుఇటు ఊగుతూ ,
అధిష్టానంతో చర్చిస్తానంటూ తాపీగా ,
అర నిమిషంలో సెలవిచ్చాడు....

అయిదు సంవత్సరాలు గడిచాయి .....
చరిత్ర పునరావృతమే అవుతోంది ,
అయినా ఒక్కడు మేల్కోలేదు ,
మళ్ళీ కథ మొదలవుతోంది...........

******










 

Tuesday, April 8, 2014

నీకు నీవే సాటి ఓ ! తరుణీమణి......_/\_

మణిమాణిక్యాలకు అతీతమైనది ,
తరువుల మాదిరి తరగని పెన్నిధి ,

అణువణువున మనలో తన జీవం నింపి ,
తరములు మారినా తరగని వన్నెతో ,

"అమ్మా" అన్న పిలుపుకు ఆలంబన అయిన నిన్ను ,
ఏ మణులతో పోల్చగలము , ఏ మాణిక్యాలతో తూచగలము ?

ఇలలో నీకు తుల్యమైనది ఏది ?
నీకు నీవే సాటి ఓ ! తరుణీమణి......_/\_

**********

Monday, April 7, 2014

మనిషిగ నేను గెలిచాను............

శిల్పిని నేను కావాలని ,
శిలను శిల్పం చేయాలని ,
ఉలిని నేను తీసాను కానీ ,
నా ఊహలు సులువు కాలేదు .

కవిని నేను కావాలని ,
కవితలు ఎన్నో రాయాలని ,
కలమును నేను తీసాను కానీ ,
నా కలలకు చేరువ కాలేదు .

గాయని నేను కావాలని ,
రాగములెన్నో తీయాలని ,
నా గళమును నేను సవరించాను కానీ ,
నే గమకములను చేరుకోలేదు .

చిత్రకారుణ్ణి నేను కావాలని ,
చిత్రములెన్నో గీయాలని ,
సుద్దముక్కను నే తీసాను కానీ ,
నా భావాలకు ప్రాణం రాలేదు .

నర్తకి నేను కావాలని ,
నాట్యములెన్నో చేయాలని ,
కాళ్ళకు గజ్జెలు కట్టాను కానీ ,
నా కళకు జీవం రాలేదు .

మనిషిని నేను కావాలని ,
మానవసేవ చేయాలని ,
ఆకలిగొన్న వృద్ధునికి పిడికెడు అన్నం పెట్టాను ,
గ్రుక్కెడు నీళ్ళు ఇచ్చాను .
 
ఆకలి తీరిన వృద్ధుడు చేయి ఎత్తి ఆశీర్వదించగ ,
మానవత్వానికి రూపం
నే కాగలిగాను ,
మనిషిగ నేను గెలిచాను .


**********

Saturday, April 5, 2014

సిరాక్షరములను ఆపలేక.....

అక్షరాలు నాలుగు ఏరుకుని ,
పదాలు నాలుగు పేర్చుకుని ,
వాక్యాలు నాలుగు కూర్చుకుని ,

నాదైన శైలిలో రాసేస్తూ ,
నాదైన బాణిలో పలికేస్తూ ,
నాదైన భావన వివరిస్తూ ,

నాలోని ఆనందాన్ని పంచేస్తూ ,
నాలోని ఆవేశం తెలిపేస్తూ ,
నాలోని ఆక్రోశం నివేదిస్తూ ,

శిలాక్షరములుగా శాసించలేక ,
రక్తాక్షరములుగా లిఖించలేక ,
సిరాక్షరములను ఆపలేక ,

నారికేళపాకమును అందుకోలేక ,
ద్రాక్షాపాకమును చేరుకోలేక ,
కదళీపాకమును ఆస్వాదిస్తూ ,

కడవరకు నా బ్లాగ్మిత్రులతో
నా కలమూ , నేనూ నడవాలని ,
కలసిమెలసి సాగాలని ఆశిస్తూ ...
 
*******






Friday, April 4, 2014

నిత్య పెళ్ళికొడుకువు నీవు ..........!!!!

మా గుండెను మండే కొలిమిని చేసి ,
మా కడుపును రగిలే కుంపటి చేసి ,
మా కళ్ళను చింత నిప్పులు చేసి ,
మా మనసున మాయని గాయం చేసి ,

నీవు మనసులో విషమును  దాచుకుని ,
చక్కని పథకం వేసుకుని ,
మరో అబలను బలిగావించుటకు  సిద్ధముగ ,
 నగనట్రా , పొలముపుట్రా బేరసారములాడుకుని ,
కట్నకానుకలు పుచ్చుకుని ,

నుదుటిన బాసికం కట్టుకుని ,
పట్టు పీతాంబరములు చుట్టుకుని ,
కాళ్ళకు పారాణి పెట్టుకుని ,
బుగ్గన చుక్కను దిద్దుకుని ,

ముఖాన నవ్వు పులుముకుని ,
చేతిలో తాళి పట్టుకుని ,
మారు మనువుకు పూనుకుని ,
మంగళ వాద్యముల నడుమన నీవు ,
మంగళసూత్రం ముడివేశావా .....?

మా మాటలు నమ్మే వారు లేరు ,
నీ మాటలు నమ్మని వారు లేరు ,
నివురు గప్పిన నిప్పువు నీవు ,
నిత్య పెళ్ళికొడుకువు నీవు ..........!!!!

*************



Thursday, April 3, 2014

కన్నతల్లి ఋణము.............

నాకు జన్మనిచ్చిన నా తల్లి
కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి
కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగి
అచేతనావస్థకు చేరుకుని , తిరిగి
తప్పక చేతనావస్థతో తేరుకుని...చేతులు చాచి
నను తన గుండెకు హత్తుకున్నది  మొదలుకొని..
 
తన ప్రతి కన్నీటి బిందువును
అకుంఠితదీక్షతో ఆశయసాధన వైపుకు
మరలించి నను పెంచినది కదా నా తల్లి......
 
నా అవిటితనమును గూర్చి నేనేనాడు
గుర్తించని దిశగా నా భవిష్యత్తు గూర్చి
ఆలోచించినది కదా నా కన్నతల్లి......
 
తన ఆత్మ విశ్వాసమును పాలుగా ఇచ్చి
నా అణువణువున శక్తిని నింపి ఈనాడు
 
నన్నునిలబెట్టగలిగినది కదా , ప్రపంచ దేశాల
ముందు ఓ పోటీదారునిగా నా కన్నతల్లి...
 
కాళ్ళు లేవని నాకు , నా కన్నతల్లి
కలత చెందుతూ కూర్చుని ఉంటే
కలనైన కలుగునా నాకీ భాగ్యం .....
 
అవయవ లోపమును చూచి
అవహేళన చేయు ఈ సమాజము నుండి ,
జాలి చూపులతో పరామర్శించే ప్రజలను చూసి
పరిపక్వత పొందిన నా తల్లి....
 
పరిపూర్ణునిగా తీర్చిదిద్దినది కదా
నన్నీవిధముగా ఈనాడు......
 
ఆమె కన్నీటి బిందువులనన్నింటినీ
ఆనందాశృవులుగా మార్చి నేను
తీర్చుకోనా కొంతైనా 
నా కన్నతల్లి ఋణము......

**************

Wednesday, April 2, 2014

కన్నవారి కలలు......?

న్నవారు కన్న కలలను ,
కాలరాసి నేలరుద్ది ,
కిరాతక చేష్టలతో ,
కీచక దుశ్చర్యలతో ,
కుత్సిత ఆలోచనలతో ,
కూరిమిని పెకలించి ,
కృశించిన మానవతతో ఉన్న నీకన్న ,
కౄరమృగమే మిన్న కదా ,
కెంవు వన్నెతో ఉన్న నీ
కేరుమన్న గొంతు విని ,
కైమోడ్పుతో దేవుని స్మరియించి ,
కొంగుచాటుగా పాలు ఇస్తూ ,
కోటి దీవెనలు కానుకిచ్చిన తల్లికి ,
కౌమార , యవ్వన దశల దిశను మార్చి చూపి ,
కంసుడిగ మారి నీవు సాధించినదేమిటో ....

*********