Tricks and Tips

Sunday, April 27, 2014

అమ్మా ! నీ ఆశ్రయం ....

అణువుగ నీ గర్భాన్ని ఆశ్రయించి ,
జన్మించి నీ ఒడిని ఆశ్రయించి ,

ఆకలిగొని నీ పాలధారను ఆశ్రయించి ,
నిదురించుటకై నీ గుండెలను ఆశ్రయించి ,

ఆటలలో ఊయలగా నీ పాదాలను ఆశ్రయించి ,
గుర్రం ఆటను ఆడుకొనగ నీ మోకాళ్ళను ఆశ్రయించి ,

ఉప్పు ఆటను ఆడుకొనగ నీ వీపుని ఆశ్రయించి ,
ఏనుగు ఆటను ఆడుకొనగ నీ భుజములను ఆశ్రయించి ,

ఆటలలో అలసి నీ పొట్టనే తలగడగా ఆశ్రయించి ,
ఎత్తుకొమ్మని చేతులిస్తూ నీ  చంకలోన ఆశ్రయించి ,

తమ బిడ్డగ నీ హృదయాన్ని ఆశ్రయించి ,
తమ తోడిదే లోకంగా నీ కన్నులను ఆశ్రయించి ,

తమ బంగరు భవితకు రూపంగా నీ ఆలోచ
లో ఆశ్రయించి ,
నీ శ్రమ ,
శ్రయాలతో ఆశయసిద్ధిని పొందిన పిల్లలు.....

తమ రెక్కల ఆశ్రయం నీకివ్వకనే ,
నిను నిరాశ్రయురాలిని చేసారా తల్లీ !!!!
 
********

6 comments:

  1. అబ్బా..గుండె బరువయ్యింది, ఎంత బాగ రాశారో...,

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి తల్లులు ఎంతో మందిని చూసి ఇలా......
      మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. తల్లీ బిడ్డల జీవన క్రమాన్ని చక్కగా వివరించి నేటి తరం పెద్దల్ని నిరాదరణకు లోనుచెయ్యడాన్ని చాలా బాగా వివరించావు.
    అభినందనలు శ్రిదేవీ! శుభమధ్యాహ్నం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభిమానపూర్వకమైన అభినందనకు ధన్యవాదములు.

      Delete
  3. "తమ బంగరు భవితకు రూపంగా నీ ఆలోచనలో ఆశ్రయించి ,
    నీ శ్రమ , ఆశ్రయాలతో ఆశయసిద్ధిని పొందిన పిల్లలు.....

    తమ రెక్కల ఆశ్రయం నీకివ్వకనే ,
    నిను నిరాశ్రయురాలిని చేసారా తల్లీ !!!! "

    Most Amazing literature it is.
    Congrats Sridevi garu.

    *Sripada

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు శ్రీపాదగారు.

      Delete