నల్లని ఆ కనుపాపల వెనుక
దాగున్న నీలిసంద్రాలెన్నో
రెప్పలార్చని చూపుల వెనుక
మసిబారిన మసక చిత్రాలెన్నో
గుప్పెడు ఆ గుండె మాటున
రగులుచున్న బడబాగ్నులెన్నో
చెదరిపోయిన మనసు వెనుక
చెదరని చేదు భావాలెన్నో
పలకని ఆ పెదవుల మాటున
కలచివేసిన కలత సంగతులెన్నో
మూగబోయిన గొంతులోన
మిగిలి ఉన్న విషాద గీతాలెన్నో
ముడుచుకుపోయిన మోము మాటున
మోడువారిన ఆశల లతలెన్నో
మూణ్ణాళ్ళకే ఆ భాగ్యజీవులు అభాగ్యులుగా
ముగిసిపోయిన తలరాతలెన్నో
సునిశిత భావాల్ని చిదిమివేసే
కరడుకట్టిన కఠినాత్ములెందరో
దాగున్న నీలిసంద్రాలెన్నో
రెప్పలార్చని చూపుల వెనుక
మసిబారిన మసక చిత్రాలెన్నో
గుప్పెడు ఆ గుండె మాటున
రగులుచున్న బడబాగ్నులెన్నో
చెదరిపోయిన మనసు వెనుక
చెదరని చేదు భావాలెన్నో
పలకని ఆ పెదవుల మాటున
కలచివేసిన కలత సంగతులెన్నో
మూగబోయిన గొంతులోన
మిగిలి ఉన్న విషాద గీతాలెన్నో
ముడుచుకుపోయిన మోము మాటున
మోడువారిన ఆశల లతలెన్నో
మూణ్ణాళ్ళకే ఆ భాగ్యజీవులు అభాగ్యులుగా
ముగిసిపోయిన తలరాతలెన్నో
సునిశిత భావాల్ని చిదిమివేసే
కరడుకట్టిన కఠినాత్ములెందరో
*****
మూగబోయిన గొంతులోన
ReplyDeleteమిగిలి ఉన్న విషాద గీతాలెన్నో
ముడుచుకుపోయిన మోము మాటున
మోడువారిన ఆశల లతలెన్నో...
భావం హృదయాన్ని తాకింది!!!
ధన్యవాదములు పద్మార్పిత, మిము స్పందింపచేసిన స్పందనను తెలియపరచినందుకు.
Deletegood information
ReplyDeleteby
http://basettybhaskar.blogspot.in/
భాస్కర్ గారు నా బ్లాగుకు స్వాగతం.మీ అభినందనకు ధన్యవాదములు.
Deletesaralamaina padaalato manasu bhavaalanu vislEshinchaaru
ReplyDeleten puvvadaగారు నా బ్లాగుకు స్వాగతం.మీ అభినందనలకు ధన్యవాదములు.
ReplyDelete