Tricks and Tips

Saturday, September 13, 2014

మసిబారిన మానవత్వం .........


  ఓ తల్లి వద్దకు దేవుడు వచ్చాడు..... వచ్చి ఆమెతో

" నీకు నీ కొడుకు ఆరోగ్యం కావాలా "......."నీ ఆరోగ్యం కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నా ఆరోగ్యమే కావాలి అంది !!!!!

" నీకు నీ కొడుకు ఆరోగ్యం కావాలా "......."నీ వ్యాపారం కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నాకు వ్యాపారమే కావాలి అంది !!!!!

" నీకు నీ కొడుకు మేలు కావాలా "....." నీ కూతురి మేలు కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నాకు నా కూతురి మేలే కావాలి అంది !!!!!

" నీకు కోడలి సౌభాగ్యం కావాలా "....." నీ కూతురి  సౌభాగ్యం కావాలా "  అన్నాడు
వెంటనే ఆమె నాకు నా కూతురి సౌభాగ్యమే కావాలి అంది !!!!!

చిట్టచివరకు దేవుడు

ఒక చేతిలో డబ్బు , మరో చేతిలో కొడుకు ప్రాణం ఉంచి
నీకేది కావాలో అది తీసుకో అన్నాడు......
రూపాయే లోకం...రూపాయే సర్వం
రూపాయే దైవం అనుకున్న ఆ తల్లి
ఆత్రంగా రూపాయలు ఎంచుకున్నది.........
దేవుడు ఆమెకు ఆ రూపాయలే మిగిల్చి
ఆమె కొడుకును తనతో తీసుకెళ్ళిపోయాడు......

తనను , తన కూతురిని సర్వకాల సర్వావస్థలలో
గొడుగై కాచిన కొడుకు విలువ తెలుసుకోలేదు !!!!!
తన జీవిత చరమాంకం కొడుకు నీడలో
సేద తీరాలని అనుకోలేదు !!!!!!

ఆస్తంతా తన పేరనే ఉందని విర్ర వీగుతూ
తన కొడుకుకు భవిష్యత్తు లేకుండా చేసి
పూడ్చిన మన్నైనా గట్టి పడలేదు...
గుండె , గూడు చెదిరిన కోడలిని , మనవడిని మరచి
తన భవిష్యత్తుకు ఎన్ని లక్షలు ఉన్నాయా
అని ఆమె లెక్కలేసుకుంటుంటే.......

మసిబారిన మానవత్వాన్ని బంధువులందరూ చూస్తూ
ముక్కున వేలేసుకుని అసహాయంగా వెనుతిరిగారు..............
 
 (దయచేసి ఎవరూ విమర్శించవద్దు , ఇది వాస్తవం )
 
***********

7 comments:

  1. ఆ ( భగవంతుణ్ణి ) దేవుణ్ణీ అనేక రూపాలతో కొలిచి కొలిచిన ఆ తల్లి రూపా(య)లే జీవితం అనుకున్నదనుకుంటూ అలా ప్రవర్తించి వుంటుందేమోననుకొంటున్నా .

    అది సబబు అనను , కాదని అనను . పరిస్థితుల ప్రభావమేననుకొంటున్నా .

    ReplyDelete
    Replies
    1. కనులు మూసుకుని ధ్యానిస్తున్న ఆ తల్లి దేవుని రూపాన్ని చూస్తుందనుకోవడం ఖచ్చితంగా భ్రమేనేమో .... రూపాయల్నే ధ్యానించి ఉంటుంది .... వాటితోనే సహజీవనం చేస్తుంది ..... మానవత్వమే లేని మనిషి ఇంతకన్నా బాగా ఎలా ఆలోచిస్తుంది... మీ స్పందనకు ధన్యవాదములు శర్మగారు.

      Delete
  2. చాలా బాగా చెప్పారు వాస్తవమే అయినా ఆశ్చర్యం లేదు

    ReplyDelete
    Replies
    1. గత ఇరవైఆరు సంవత్సరాలుగా నేను చూసిన వాస్తవం మీరజ్......

      Delete
  3. మీ సేకరణ చాలా విలువైనది
    by
    http://basettybhaskar.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు మీ అభినందనకు ధన్యవాదములు.

      Delete