Tricks and Tips

Wednesday, April 16, 2014

ఆత్మావలోకనం.................

నిన్నటివరకు
నీవే నేను , నేనే నీవు
నీకై నేను , నాకై నీవు
నీలో నేను , నాలో నీవు

ఆశ , శ్వాస ఒకటై ,
ఆశయాలు ఒకటై ,
కలలు ఇలలో ఒకటై ,
కళకళలాడుతు కలిసుండే మనము....

ఎందుకు ? ఎందుకు ?
ఎందుకిలా ఎడ , పెడ ముఖాలు ?
 
ఆడంబరాలను ఆశ్రయించి ,
ఆత్మవిమర్శలు మరచిపోయి ,
ఆత్మవంచన చేసుకుని ,
ఆధిపత్యపోరులో పావులమై ,

వివేకం నుండి అవివేకానికి ,
జ్ఞానం నుండి అజ్ఞానానికి ,
అథః పాతాళానికి జారిపోయి.... 

 అలుపుసొలుపు మరచి మనము ,
ఆరోపణల పర్వతాన్నే
అధిరోహించాం అవలీలగా ,
 
ఆఖరిసారిగ
 
మన కనులు కనులు కలవగనే ,
మన కలలు కళ్ళలో కదలాడి ,
ఇలలోకొచ్చి పరికిస్తే........
లోయల అంచున నిలుచున్నాం . 

ఆత్మావలోకనం చేసుకుని ,
మనసును మనసు హత్తుకుని ,
చేతిలో చేయి పట్టుకుని ,
అడుగులో అడుగు వేసుకుని ,
అన్నీ ఒకటిగ చేసుకుని ,
ఆనందభాష్పాలు తుడుచుకుని ,
ఆదర్శ జంట అవుదాము .

*******
 

8 comments:

  1. మంచి ఆలోచన,ఆచరణ కూడా.
    ఇలా ఎన్ని జంటలు ఆలోచిస్తున్నాయి?
    దేవీ మంచి కవిత మీదైన శైలిలో.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. మంచి కవితను అందించారు

    ReplyDelete
    Replies
    1. పద్మార్పితా మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  3. కారణాలేవైనా
    ఏ సంబంధాల్లోనైనా
    చిరు వైషమ్యాలు
    తలెత్తడం సహజం
    నిజానికవి వారి వారి
    స్వభావపు పరిణామాలే కాని
    తప్పులుగా పరిగణించలేం.
    కావాల్సిందల్లా
    ఒండొరుల
    స్వభావాల్ని
    గుర్తెరిగి
    మెలకువలకు
    అణకువ జత చేసి
    అలవోకగా
    జీవితపు ప్రతీ మజిలీలోని
    ప్రతి మలుపులోనూ
    మాధుర్యాల్నె చవి చూడొచ్చు .
    చెలిమి వీడని చేతుల బలిమి
    చెదిరిపోని ఆనందపు కలిమి.. 

    ReplyDelete
    Replies
    1. చెరిగిపోని కలల చెలిమి .....
      జానీగారు,మీ కవితాభినందనలకు ధన్యవాదములు.

      Delete
  4. కొంతమందినైనా ఈ ఆత్మావలోకనం మార్చగలదని ఆశిస్తున్నాను . నైస్ .

    ReplyDelete
    Replies
    1. అలా జరిగితే నిజంగా ఎంత సంతోషంగా వుంటుందో మాటలలో చెప్పలేమేమో శర్మగారు,మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete