Tricks and Tips

Sunday, July 13, 2014

ఆహా ! ఎంత నిశ్శబ్ధం ....

శారీరక బాధలకు సెలవిచ్చేశా ,
మనోవ్యధలను విడచిపెట్టేశా ,
బంధాలన్నీ తెంచేశా ,
బరువు బాధ్యతలను వదిలేశా ,
కోరికలన్నీ కొండెక్కించేశా ,
కలత నిద్దురకు స్వస్తి పలికేశా ,
ప్రశాంత నిదురను ఆహ్వానించా.........

అనంతమైన శబ్ధాలకు దూరంగా ,
సుదూరంగా పయనించి....
నే చేరుకున్న నిర్మల ప్రదేశం.........

ఆహా ! ఎంత నిశ్శబ్ధం ,
ప్రశాంతమైన వాతావరణం ,

నే కదిలితేనే శబ్ధం ,
అందుకే నే అణువంతైనా కదలను ,

నే శ్వాసిస్తేనే శబ్ధం ,
అందుకే నా శ్వాసను సైతం బంధించేశా ,

నే రెప్పలార్పితేనే శబ్ధం ,
అందుకే నా రెప్పలు మూసే ఉంచాను ,

నే మాట్లాడితేనే శబ్ధం ,
అందుకే నా పెదవులు ముడుచుకున్నాను ,

నే కదిలితేనే శబ్ధం ,
అందుకే నే కదలక పడుకున్నాను ,
నా ఈ ఆరడుగుల ఆస్థానంలో............

 
*******

2 comments:

  1. .వెరీ నైస్. ఎంత బాగా చెప్పారు really Like it...

    ReplyDelete
    Replies
    1. వనజగారు మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు .

      Delete