Tricks and Tips

Tuesday, August 5, 2014

అనగనగా కథలు పోయే ...........

 అనగనగా , కథలు పోయే ,
చందమామ కథలు పోయే ,
బాలమిత్ర కథలు పోయే ,
బొమ్మరిల్లు కథలు పోయే ,

నీతికథలను నీరుగార్చి ,
జానపద కథల జాడే మరచి ,
చారిత్రక కథలను చెరిపివేసి ,
ఇతిహాస కథలను ఇగిరించేసి ,
పురాణాలను పొలిమేరలు దాటించి ,

బామ్మల నుండి అమ్మల వరకు
బొమ్మలపెట్టెకు అతుక్కుపోయి ,
బాలల బంగరు బాల్యాన్ని
బొమ్మలపెట్టెకు బలిచేస్తుంటే ,

బాలనేరస్తులకు కొదవా లేదు....
అమ్మ బాధ్యతకు అర్ధం లేదు....

*****

10 comments:

  1. "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
    http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

    ReplyDelete
  2. శ్రీదేవి ,

    చాలా బాగుంది , అన్నీ కళ్ళకు కట్టిన నిజాలే , కొంతమంది మనసుకు నచ్చినా , నచ్చకున్నా .

    ఆరంభంలో మాత్రం యిలా కంటే ,

    అనగనగా కథలు పోయే ,

    ఇలా వుంటే బాగుంటుంది .

    అనగనగా ,

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ సూచనకు ధన్యవాదములు . సరిచేశాను .

      Delete
  3. టపా బాగుందండీ. అభినందన.

    ReplyDelete
    Replies
    1. బివిడి ప్రసాదరావుగారు నా బ్లాగుకు స్వాగతమండి , మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  4. నిజమే శ్రీదేవిగారు కథలు పోవడానికి కారణాల్లో టీవీ ఒకటి. బొమ్మలపెట్టి ఎంత పనిచేసింది!

    ReplyDelete
    Replies
    1. ఇప్పటి పిల్లలకు మన రామాయణ, భారతాల్లోని చిన్న చిన్న కథలు కూడా తెలియక పోవడం ఎంతో విచారించవలసిన విషయం కిషోర్ గారు. మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  5. చాలా బాగా రాశారండి.. మీ టపాలలో నాకు మరీ ముక్యంగా నచ్చిన అంశం ఏంటంటే, సాదారణ, వాడుకలోని పదాలతో అద్బుతంగా కవితలు రాయడం... హాట్సాఫ్!!

    ReplyDelete
    Replies
    1. చిరంజీవిగారు మీ అభిమానానికి ధన్యవాదములు.

      Delete