అవునవును , సమాజం లోని అకృత్యాలన్ని ఆడవారి వస్త్రధారణ వల్లే జరుగుతున్నాయి..... ఓ పెద్ద మనిషిగారు ఇటీవలే సెలవిచ్చారు. కె.జి క్లాసులు....... చదివే పిల్లలు రెచ్చగొట్టే వస్త్రధారణ చేసుకుంటే జరిగిందా అమానుషం ? పాఠశాలలో పదవ తరగతి వరకు చదివే పిల్లలు ధరించే యూనిఫాం రెచ్చగొట్టే వస్త్రధారణా ? అకృత్యాలకు బలైపోయిన ఆడపిల్లలందరూ రెచ్చగొట్టే వస్త్రధారణలోనే ఉన్నారా , వారితో పాటు వెంట వున్న తల్లిని కూడా వదలని సమయాల్లో ఆ తల్లి కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వుందా, ముప్ఫై , నలభై , యాభై , అరవై యేళ్ళ స్త్రీలు కూడా కామాంధులకు బలైపోతున్నారు కదా , మరి వారందరూ కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వున్నారా...... ఏం మాట్లాడుతారు రాజకీయ నాయకులు....! ఏమైనా మాట్లాడుతారు రాజకీయ నాయకులు....! సమాజంలో నానాటికీ స్త్రీల పట్ల పెరుగుతున్న అమానుషాల్ని ఎలా అరికట్టాలి అని ఆలోచించవలసినది పోయి , వారి దుస్తులను గూర్చి మాట్లాడడం ఎంత వరకు సమంజసం. అటువంటి అకృత్యాలకు పాల్పడేవారికి ఏ విధమైన శిక్షలు విధించాలి /ఏవిధమైన చర్యలు తీసుకోవాలి.... వంటి విషయాలను చర్చించ వలసినది పోయి ఇలా మాట్లాడతారా...... యువత పై ఎంతో ప్రభావం చూపుతున్న నేటి సినిమాలలోని అశ్లీలతను గూర్చి ఆలోచించవలసిన ఒకనాటి హీరోగారు....నేటి సమాజంలోని విలన్లను గూర్చి మాట్లాడక....... ఆడవారి వస్త్రధారణ గూర్చిమాట్లాడుతారా !!!!
ఏవిషయమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతో అవసరం .
********
అకృత్యాలు వస్త్రధారణ వల్ల జరగటం లేదన్నది అక్షర సత్యం .
ReplyDeleteకాకుంటే ఆ ఆలోచన వున్న వాళ్ళను ఆ వస్త్రధారణ రెచ్చగొట్టుతుందన్నది అక్షర సత్యమే .
అయితే అసలు ఆ ఆలోచనలు కలగకుండా వుండాలనే మన ముందు తరాల వాళ్ళు కొన్ని కట్టుబాట్లను పెట్టారు .
అందులో భాగాలే ఈ దిగువ వుదాహరణలు .
ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాని , చూడవలసివచ్చినఫ్ఫుడు కాని తలవంచుకొనే మాట్లాడమన్నారు మగవాళ్ళను .
అలాగే అదే ఆడవాళ్ళను పిలవవలసి వచ్చినప్పుడు గాని ,వుదహరించవలసి వచ్చినప్పుడు గాని వాళ్ళ పేర్ల చివర అమ్మ అన్న పదాన్ని కలిపి సంబోధించమన్నారు .
ఉదా : తులసి = తులశమ్మ
సుబ్బలక్ష్మి = శుబ్బలక్షమ్మ లేక సుబ్బమ్మ.
వెంకటలక్ష్మి = వెంకటలక్షమ్మ
రంగనాయకి = రంగనాయకమ్మ
శారద = శారదమ్మ
భారతి = భారతమ్మ
ముసలి వాళ్ళు అయితేనో , పిల్లల్ని కంటేనో అమ్మలు కానఖ్ఖరలేదు .
అమ్మ భావన తోనే చూడటం జరుగుతుందన్నమాట .
ఇలాగే మగవాళ్ళను కూడా ఆడవాళ్ళు పిలవవ్లసి వచ్చినప్పుడు వాళ్ళ అసలు పేరు తర్వాత అయ్య తగిలించి పిలవమనేవాళ్ళు .
ఇలాంటి పిలుపులతో ఎలాంటి దుర్భావనలు వాళ్ళ మనసులలో రేకెత్తకుండా వుండాలనే సదుద్దేశంతో ఏర్పరిచారు .
నేటి కాలంలో అవి అన్నీ పాత చింతకాయ పచ్చడి , బూజు పట్టిన భావాలు అన్న వింత అభిప్రాయాలతో వాటికి స్వస్తి పలికేసరికి , అసలు జీవితాలకే ఎసరు పెట్టుకున్నట్లయింది .
మన ముందు తరాల వాళ్ళు చెప్పినవన్నీ , ముందు తరాల వాళ్లకు జరగకూడదన్న సదుద్దేశంతో చెప్పినవని గ్రహించటం చాలా అవసరం .
అందుకే ఈ కలియుగంలో గాంధీ గారు కూడా మంచి విషయాలనే ప్రబోదించారు .
చెడు అనకు ,
చెడు వినకు ,
చెడు కనకు .
అని . అంటే చెడు అనేది , అన్నా , విన్నా , కన్నా ( చూచినా ) మహా ప్రమాదకరమైనదట . ఎంత ప్రమాదకరమైనదంటే , వెంటనే చేసెయ్యమని ప్రేపిస్తుందట . ఈ 3 ప్రాణుల మనసు మీద ప్రభావం చూపుతాయట . వీటి ప్రభావంతో మానవులు కోతులు అయిపోతారట . అందుకే ఆయన వాటి రూపం ద్వారానే చాటారు .
అసలు ఆ దురాలోచనలు మనసుల్లో మొలకెత్త కూడదు . మొలకెత్తిన తర్వాత , ఈ మీడియా వాటిని వాళ్ళకందుబాటులో వున్నంత పరిధిలో ప్రొత్సహిస్తునారు చెప్పకనే చెప్పినట్లు ( సంపాదన రూపంలో ) .
ఎప్పుడైనా కలుపు మొక్క వేరుతో సహా పెరికివేయాలి అంతే గాని పై మొక్కను మాత్రం తుంచకూడదు .
ఇక రాజకీయ నాయకులంటారా ? మన ఇండియాలో లైసెన్సుడుగా , ధైర్యంగా సంపాదించుకోగలిగినది ( ఏ విద్యార్హతలు లేకుండా ) ఆ రాజకీయ పదవులొక్కటే . అందుకే వారెలాగైనా , ఎక్కడైనా , ఎప్పుడైనా మాట్లాడుతుంటారు .
నిజానికి యిలాంటి మాటలు వాళ్ళు మాట్లాడకూదదు . వాల్లు ఈ ప్రజలచేత ఎన్నుకొనబడ్డ ప్రజా ప్రతినిధులు . ఇది తెలుసుకొని మసులుకోవటం ఎంతైనా వాళ్ళ జీవితాలకి మంచిది .
శర్మగారు, మీ వివరణాత్మకమైన రచన చాలా చక్కగా వుంది. మీకు ధన్యవాదములు.
Delete