Tricks and Tips

Sunday, April 13, 2014

ప్రజాస్వామ్య ప్రభుత్వం.....!!!!


నాకు నిన్న ఎలక్షన్ డ్యూటీలో ఒక గొప్ప విషయం తెలిసింది.నేను గుర్తింపు కార్డులు చూస్తున్నాను. ఒక వ్యక్తి ఏ గుర్తింపు కార్డు లేకుండా వచ్చాడు ఒంటిగంట సమయంలో.బాబూ! ఏదో ఒక గుర్తింపుకార్డు తీసుకురావాలి కదా, అన్నాను .ఆ వ్యక్తి "మా ఇల్లు కాలిపోయిందండి" అన్నాడు.నేను వెంటనే ఏజెంట్ల వైపు చూశాను.వారంతా ఇల్లు కాలిపోవడం నిజమే అన్నారు.కానీ అతన్ని ఓటు వేయించడానికి మెజారిటీ ఏజెంట్లు ఒప్పుకోలేదు .సాయంత్రం అయిదింటి వరకు భోజనం చేయకుండా అక్కడే ఉన్నాడు.బ్రతిమాలిన ఊరిలోవారే ఒప్పుకోకపోవడం చూసి నాకు నిజంగా చాలా బాధనిపించింది. ఆ పేదవాడి కళ్ళలోని ఆవేదన , నిస్సహాయత............ ఓటరు గుర్తింపు స్లిప్పులను ఫోటోతో సహా  ఇచ్చి ప్రభుత్వమే ,ఆ స్లిప్పు కాకుండా మళ్ళీ మరో గుర్తింపుకార్డు తెమ్మంటే, ఇల్లు కాలిపోయిన నేను ఎక్కడి నుండి తెస్తానండీ... అని దీనంగా అడుగుతుంటే  ...................ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పేదవానికి ఓటుహక్కు వినియోగించుకునే అర్హత కూడా లేదన్నమాట అనుకున్నాను, నేనూ నిస్సహాయంగా. 
( ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కడు ఓటు వేసిన తర్వాత వచ్చిన గెలుపే నిజమైన " విజయం ")

2 comments:

  1. నిజమే , అసలు సిసలు ప్రజాసేవ అప్పుడే మనకు లభ్యమవుతుంది .

    ReplyDelete
    Replies
    1. శర్మగారూ నా బ్లాగుకు స్వాగతం.మీ స్పందనలకు ధన్యవాదములు.

      Delete