కన్నవారు కన్న కలలను ,
కాలరాసి నేలరుద్ది ,
కిరాతక చేష్టలతో ,
కీచక దుశ్చర్యలతో ,
కుత్సిత ఆలోచనలతో ,
కూరిమిని పెకలించి ,
కృశించిన మానవతతో ఉన్న నీకన్న ,
కౄరమృగమే మిన్న కదా ,
కెంవు వన్నెతో ఉన్న నీ
కేరుమన్న గొంతు విని ,
కైమోడ్పుతో దేవుని స్మరియించి ,
కొంగుచాటుగా పాలు ఇస్తూ ,
కోటి దీవెనలు కానుకిచ్చిన తల్లికి ,
కౌమార , యవ్వన దశల దిశను మార్చి చూపి ,
కంసుడిగ మారి నీవు సాధించినదేమిటో ....
కాలరాసి నేలరుద్ది ,
కిరాతక చేష్టలతో ,
కీచక దుశ్చర్యలతో ,
కుత్సిత ఆలోచనలతో ,
కూరిమిని పెకలించి ,
కృశించిన మానవతతో ఉన్న నీకన్న ,
కౄరమృగమే మిన్న కదా ,
కెంవు వన్నెతో ఉన్న నీ
కేరుమన్న గొంతు విని ,
కైమోడ్పుతో దేవుని స్మరియించి ,
కొంగుచాటుగా పాలు ఇస్తూ ,
కోటి దీవెనలు కానుకిచ్చిన తల్లికి ,
కౌమార , యవ్వన దశల దిశను మార్చి చూపి ,
కంసుడిగ మారి నీవు సాధించినదేమిటో ....
*********
దేవీ, క నుండి కం వరకు మొత్తుకున్నా. అమ్మాయి నుండి అమ్మమ్మ వరకూ ఈ కష్టాలు తప్పవు.
ReplyDeleteమీ కలానికి మరోమారు సలాం చేస్తున్నా..
క నుండి కః వరకు కాదు మీరజ్ , అ నుండి ఱః వరకు మొత్తుకున్నా అంతే................మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteకన్నవారి కలలు, కాలరాసి .... కృరమృగాన్ని మించిన కిరాతకపు చేష్టలు, కీచక దుశ్చర్యలు, కుత్సితపు ఆలోచనలు
ReplyDeleteనీ కేరుమన్న గొంతు విని కైమోడ్పుతో దేవుని స్మరియించి కొంగుచాటుగా పాలు ఇస్తూ కోటి దీవెనలు కానుకిచ్చిన తల్లికి కౌమార , యవ్వన దశల దిశను మార్చి చూపిన కంసుడా ...
కంసుడు నరకాసురుడు రావణాసురుడు కీచకుడు లాంటి ఎందరో ....
చక్కని దృశ్య కావ్యం శ్రీదేవీ!
కలికాలం కళ్ళ ముందుంచుతున్నారు చంద్రగారు,మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
Delete