మణిమాణిక్యాలకు అతీతమైనది ,
తరువుల మాదిరి తరగని పెన్నిధి ,
అణువణువున మనలో తన జీవం నింపి ,
తరములు మారినా తరగని వన్నెతో ,
"అమ్మా" అన్న పిలుపుకు ఆలంబన అయిన నిన్ను ,
ఏ మణులతో పోల్చగలము , ఏ మాణిక్యాలతో తూచగలము ?
ఇలలో నీకు తుల్యమైనది ఏది ?
నీకు నీవే సాటి ఓ ! తరుణీమణి......_/\_
**********
ఆడది
ReplyDeleteఅమ్మాయి
అమ్మ
ఆత్మీయతా
ఆలంబనా
అనురాగం
ఆర్ద్రతా
ఆర్తీ
ఆలనా పాలానా
అక్షరమాల లోని ఆద్యక్షరాలైన
అ ఆ లే మన జీవితాలకు
జీవాల్ని నింపి
ఆదుకునేవి ..
ఇంతకంటే అమ్మతనం గూర్చి
అతిశయమేముంది..
అమ్మ....ఆదర్శం గూర్చి బాగా వివరించారు,ధన్యవాదములు జానీగారు.
Deleteతరగని పెన్నిధిగా, అమ్మవై జీవం నింపి, తరగని వన్నెతో "అమ్మా" అన్న పిలుపుకు ఆలంబన అయి .... ఏ మణివో, మాణిక్యానివో? ఇలలో నీకు తుల్యమైనది ఏది? నీకు నీవే సాటి ఓ ! తరుణీమణి......_/\_
ReplyDeleteఅమ్మకు మనఃపూర్వక నీరాజనాలు చక్కగా తెలియపరిచావు
చాలా బాగుంది అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!
అమ్మ గూర్చి ఎంత చెప్పినా తక్కువేనేమో అనిపిస్తుంది చంద్రగారు,మీ ప్రోత్సాహకాభినందనకు ధన్యవాదములు.
Deleteఅమ్మ,అమ్మే మరో పోలిక లేదు ఇక రాదు కూడా,
ReplyDeleteమీశైలి బాగుంది దేవీ.
మీతో తప్పక ఏకీభవిస్తాను కానీ ,కొంత మంది మాట్లాడుతున్నా.............
ReplyDeleteవారి భావాలను వింటున్నా , ................చదువుతున్నా.......
అమ్మ కనిపిస్తుంటుంది మీరజ్ ఒక్కొక్కసారి..........అవునా ?
జన్మనిచ్చినా కొంత మంది తల్లులు ఎలా కాలేకపోతున్నారో,
జన్మనీయక పోయినా మరి కొంతమంది అలానే తల్లులవుతున్నారు కదా........
అమ్మ వేరు తల్లి వేరూ నా దృష్టిలో...
ReplyDeleteతల్లి జన్మనిస్తుంది, అమ్మతనం ఉన్నా లేకపోయినా,
అమ్మ్మతనం కలిగిన ప్రతి స్త్రీ అమ్మే...జన్మనిచ్చినా ఇవ్వలేకపోయినా.