Tricks and Tips

Wednesday, April 23, 2014

నాకై విరిసిన....... నీ కోపం

నా ఎంపిక చూసి ఊరూవాడా
వేనోళ్ళతో నను కొనియాడ
నీ చిరునవ్వును చూసి మనువాడా
నా జీవితమాయెను విరివాడ......

విరిసీ విరియని నవ్వులు దాటి
నీ చిరుకోపం ముందడుగేయగ
నా ఆలోచనలు సంధిగ్ధావస్థతతో
సతమవుతూ సంధిని చేయగ.....

నా జ్ఞానజ్యోతి కాంతులలో
నిశితంగా చూశా......ఆ కోపాన్ని
నాకై విరిసిన నీ కోపం
నాపై నీ ప్రేమకు ప్రతిరూపం.......

నా సమయపాలనారాహిత్యానికి ఆవేదనతో
ప్రేమతో కూడిన నీ కోపం.....
నా అనారోగ్యానికి ఆందోళనతో
నా
కై విరిసిన నీ కోపం.........

నీ చిరునవ్వుల విరివానలో
అలసట మరచి నిదురించా.....
నాకై విరిసిన నీ కోపంలో
 నీ ప్రేమను చూస్తూ ఇహమును మరిచా.......

***********

2 comments:

  1. నిజమే శ్రీదేవిగారు .. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది .. అందులో బాధ్యత ఇమిడిపోతుంది .. భార్యాభర్తల మధ్య బంధాన్ని చాలా బాగా వివరించారు .. మీ కోపం లో ప్రేమ అందం గా కనిపించింది శ్రీదేవి గారు

    ReplyDelete
    Replies
    1. ఓహ్! రాధికా మీ స్పందనలకు ధన్యవాదాలు.

      Delete