మెరుపుల బోయిలు వచ్చిరి నాకై ,
మబ్బుల పల్లకి తెచ్చిరి నాకై ,
ఆనందతాండవమాడగ మనసు ,
ఆ తారా తీరం చేరుకున్నా........
తారలు బారులు తీరిరి నాకై ,
తళతళ తళుకులు కురిపించిరి నాపై ,
సంబరమంబరమంటగ మదిలో ,
ఆ నెలరాజుకై నా కన్నులు వెతికే......
వెన్నెల కిరణం కుశలం అడుగగ ,
చల్లని తెమ్మెర దాహం ఇవ్వగ ,
అలజడి అలలుగ కదలగ హృదిలో ,
రేరాజుకు నే చేరువయ్యా........
మబ్బుల పల్లకి తెచ్చిరి నాకై ,
ఆనందతాండవమాడగ మనసు ,
ఆ తారా తీరం చేరుకున్నా........
తారలు బారులు తీరిరి నాకై ,
తళతళ తళుకులు కురిపించిరి నాపై ,
సంబరమంబరమంటగ మదిలో ,
ఆ నెలరాజుకై నా కన్నులు వెతికే......
వెన్నెల కిరణం కుశలం అడుగగ ,
చల్లని తెమ్మెర దాహం ఇవ్వగ ,
అలజడి అలలుగ కదలగ హృదిలో ,
రేరాజుకు నే చేరువయ్యా........
******
మొత్తమ్మీద సాదించావ్ కదా...:-))
ReplyDeleteమరి బ్రతిమాలినా ఇవ్వకపోతే ఏం చేస్తాం.......సాధించాలిగా పట్టుదలతో...
Deleteఆ చందమామని వదిలేట్టులేరే....
ReplyDelete