సమైక్యాంధ్ర మన నినాదమని ,
సమైక్యతే మన విధానమని ,
రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి ,
కాలేజీలు మూసివేసి ,
విద్యార్ధులను రెచ్చగొట్టి ,
ఉద్యమమని ఊదరేసి ,
పోలీసుల లాఠీలకు
విద్యార్ధులు బలైపోతే ,
కటకటాల వెనుక వారు
చీకటిలో మగ్గుతుంటే ,
భవిష్యత్తు మీదంటూ
బల్లగుద్ది చెప్పినోడు ,
అధిష్టానం కుట్రలంటు....
వారి సంగతి విడచి పెట్టి ,
అధిష్టానం దిష్టిబొమ్మలు ,
ఆర్డరిచ్చి తెప్పించి ,
కాళ్ళతో తొక్కించి ,
చెప్పులతో కొట్టించి ,
తుదకు కొరివి పెట్టించి ,
వాడికి గుండు కూడా గీయించి ,
అల్లకల్లోలాలు సృష్టించి ,
అతిశయాలు వల్లించి ,
నడివీధిలోన అరాచకాలను
దునుమాడే యోధుడిలా ,
మైకు చేత పట్టుకుని ,
పూనకంతో ఊగిపోయి ,
నలుగురిలో మారుమ్రోగి ,
నాలుగు డబ్బులు విసిరివేసి ,
నిరుపేదల జీవితాలను ,
నిస్సిగ్గుగ వాడుకుని ,
వారి కంటి దీపాలను...
కర్కశంగా ఊదివేసి ,
అమరవీరులు మీ బిడ్డలంటూ ,
అతిగ నీవు వాగుతుంటే ,
అమాయకులు తమ బిడ్డలకు
తామే జోహారులర్పిస్తూ ,
నీకు జేజేలు కొడుతుంటే ,
వికృతంగ మనసులోన నీవు....
వికటాట్టహాసం చేసుకుంటూ ,
ఏ . సి చాంబరులో దూరి ,
రాజకీయ మంతనాలు జరిపి నీవు ,
మున్ముందున్న రోజులన్నీ మనవేనంటూ ,
మరో మారు మైకు పట్టి పూనకంతో ,
ఊగిపోతూ గీపెట్టి చెప్పినావు...
M.L.A / M.P టిక్కెట్టు దక్కినదంటూ ,
ప్లేటు ఫిరాయించి వేసి ,
సమైక్యతే మన విధానమని ,
రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి ,
కాలేజీలు మూసివేసి ,
విద్యార్ధులను రెచ్చగొట్టి ,
ఉద్యమమని ఊదరేసి ,
పోలీసుల లాఠీలకు
విద్యార్ధులు బలైపోతే ,
కటకటాల వెనుక వారు
చీకటిలో మగ్గుతుంటే ,
భవిష్యత్తు మీదంటూ
బల్లగుద్ది చెప్పినోడు ,
అధిష్టానం కుట్రలంటు....
వారి సంగతి విడచి పెట్టి ,
అధిష్టానం దిష్టిబొమ్మలు ,
ఆర్డరిచ్చి తెప్పించి ,
కాళ్ళతో తొక్కించి ,
చెప్పులతో కొట్టించి ,
తుదకు కొరివి పెట్టించి ,
వాడికి గుండు కూడా గీయించి ,
అల్లకల్లోలాలు సృష్టించి ,
అతిశయాలు వల్లించి ,
నడివీధిలోన అరాచకాలను
దునుమాడే యోధుడిలా ,
మైకు చేత పట్టుకుని ,
పూనకంతో ఊగిపోయి ,
నలుగురిలో మారుమ్రోగి ,
నాలుగు డబ్బులు విసిరివేసి ,
నిరుపేదల జీవితాలను ,
నిస్సిగ్గుగ వాడుకుని ,
వారి కంటి దీపాలను...
కర్కశంగా ఊదివేసి ,
అమరవీరులు మీ బిడ్డలంటూ ,
అతిగ నీవు వాగుతుంటే ,
అమాయకులు తమ బిడ్డలకు
తామే జోహారులర్పిస్తూ ,
నీకు జేజేలు కొడుతుంటే ,
వికృతంగ మనసులోన నీవు....
వికటాట్టహాసం చేసుకుంటూ ,
ఏ . సి చాంబరులో దూరి ,
రాజకీయ మంతనాలు జరిపి నీవు ,
మున్ముందున్న రోజులన్నీ మనవేనంటూ ,
మరో మారు మైకు పట్టి పూనకంతో ,
ఊగిపోతూ గీపెట్టి చెప్పినావు...
M.L.A / M.P టిక్కెట్టు దక్కినదంటూ ,
ప్లేటు ఫిరాయించి వేసి ,
నీవు దుమ్మెత్తి పోసిన అధిష్టానం ,
ఏం చేసినా లోకకల్యాణార్ధమే అంటూ ,
వినమ్రంగ చేతులెత్తి ,
అధిష్టానానికి వంగి మ్రొక్కి ,
ఆ పార్టీ తరుపున నీవు బరిలోకి దిగుతుంటే ,
అమాయకులైన ప్రజలు తిరిగి ,
అన్నా ! నీకే మా ఓటన్నా అంటూ ,
నీ చుట్టూ భజన చేస్తుంటే ,
అయ్యో ! వీరి మత్తు వదలదా....? అనుకుంటూ....
అసహాయంగా వారినే చూస్తున్నా నే చేష్టలుడిగి.....
వినమ్రంగ చేతులెత్తి ,
అధిష్టానానికి వంగి మ్రొక్కి ,
ఆ పార్టీ తరుపున నీవు బరిలోకి దిగుతుంటే ,
అమాయకులైన ప్రజలు తిరిగి ,
అన్నా ! నీకే మా ఓటన్నా అంటూ ,
నీ చుట్టూ భజన చేస్తుంటే ,
అయ్యో ! వీరి మత్తు వదలదా....? అనుకుంటూ....
అసహాయంగా వారినే చూస్తున్నా నే చేష్టలుడిగి.....
(మా ప్రక్క నియోజకవర్గంలో ఓ రాజకీయ నాయకుని కొడుకుకు ఇలానే టిక్కెట్ వచ్చింది )
******
ఇలా చెడుగుడు ఆడేస్తే ఎలా,
ReplyDeleteమనకు నాయకులొద్దా, పాలన వద్దా, మనమేమో పిల్లలో ఉండిపోతాం, మనకు స్వచ్చంగా అలాంటి మనస్సులే కావాలంటే ఎలా????:-))
అభినందనలు దేవీ మీ కలానికున్న పదును మరింత మెరుగయ్యింది.
ఏం చేద్దాం మీరజ్ ఆవేదనలు బుర్రలోకి వెళితే,ఆవేశం కలంలోకి వెళుతోంది,వెరసి బ్లాగులో చెడుగుడు.......
Delete