ఆకలి అమ్మా ! అంటే నన్ను ,
జోకొట్టి బజ్జోపెట్టావ్.........
అమ్మా ! నను బజ్జోపెట్టి ,
నీవు ఎక్కడికెళ్ళిపోయావు.....?
అన్నం నాకు వద్దమ్మా ,
ఆకలి...అననే అననమ్మా.....
నువ్వు నాతో ఉంటే చాలు ,
నా వేలు పట్టుకుంటే చాలు....
బూచోడొస్తే నాకు భయము ,
చీకటి పడితే ఇంకా భయము....
నిన్ను వదిలి నే ఉండనమ్మా ,
నన్ను వదిలి నీవు పోవద్దమ్మా.....
నీ కొంగులో నన్ను కట్టుకో అమ్మా ,
నీ ఒడిలో నన్ను పెట్టుకో అమ్మా.......
నీ మెడలో తా(ళి)డు పట్టుకుని ,
నే నోటిలో వేలు పెట్టుకుని...
హాయగ నేను బజ్జుంటా ,
అన్నం నాకు వద్దంటా.....
మంచినీళ్ళు చాలమ్మా ,
మా మంచి అమ్మవు నువ్వమ్మా......
********
జోకొట్టి బజ్జోపెట్టావ్.........
అమ్మా ! నను బజ్జోపెట్టి ,
నీవు ఎక్కడికెళ్ళిపోయావు.....?
అన్నం నాకు వద్దమ్మా ,
ఆకలి...అననే అననమ్మా.....
నువ్వు నాతో ఉంటే చాలు ,
నా వేలు పట్టుకుంటే చాలు....
బూచోడొస్తే నాకు భయము ,
చీకటి పడితే ఇంకా భయము....
నిన్ను వదిలి నే ఉండనమ్మా ,
నన్ను వదిలి నీవు పోవద్దమ్మా.....
నీ కొంగులో నన్ను కట్టుకో అమ్మా ,
నీ ఒడిలో నన్ను పెట్టుకో అమ్మా.......
నీ మెడలో తా(ళి)డు పట్టుకుని ,
నే నోటిలో వేలు పెట్టుకుని...
హాయగ నేను బజ్జుంటా ,
అన్నం నాకు వద్దంటా.....
మంచినీళ్ళు చాలమ్మా ,
మా మంచి అమ్మవు నువ్వమ్మా......
********
అమ్మ ప్రేమ కనిపిస్తుంది కవితలో..అహినందన్లు దేవీ.
ReplyDeleteమరి పసిబిడ్డలకు అమ్మ ప్రేమే లోకం కదా మీరజ్ ,మీ అభినందనలకు ధన్యవాదములు.
Delete