నిన్నటివరకు
నీవే నేను , నేనే నీవు
నీకై నేను , నాకై నీవు
నీలో నేను , నాలో నీవు
ఆశ , శ్వాస ఒకటై ,
ఆశయాలు ఒకటై ,
కలలు ఇలలో ఒకటై ,
కళకళలాడుతు కలిసుండే మనము....
ఎందుకు ? ఎందుకు ?
ఎందుకిలా ఎడ , పెడ ముఖాలు ?
నీవే నేను , నేనే నీవు
నీకై నేను , నాకై నీవు
నీలో నేను , నాలో నీవు
ఆశ , శ్వాస ఒకటై ,
ఆశయాలు ఒకటై ,
కలలు ఇలలో ఒకటై ,
కళకళలాడుతు కలిసుండే మనము....
ఎందుకు ? ఎందుకు ?
ఎందుకిలా ఎడ , పెడ ముఖాలు ?
ఆడంబరాలను ఆశ్రయించి ,
ఆత్మవిమర్శలు మరచిపోయి ,
ఆత్మవంచన చేసుకుని ,
ఆధిపత్యపోరులో పావులమై ,
ఆత్మవిమర్శలు మరచిపోయి ,
ఆత్మవంచన చేసుకుని ,
ఆధిపత్యపోరులో పావులమై ,
వివేకం నుండి అవివేకానికి ,
జ్ఞానం నుండి అజ్ఞానానికి ,
అథః పాతాళానికి జారిపోయి....
జ్ఞానం నుండి అజ్ఞానానికి ,
అథః పాతాళానికి జారిపోయి....
అలుపుసొలుపు మరచి మనము ,
ఆరోపణల పర్వతాన్నే
అధిరోహించాం అవలీలగా ,
ఆరోపణల పర్వతాన్నే
అధిరోహించాం అవలీలగా ,
ఆఖరిసారిగ
మన కనులు కనులు కలవగనే ,
మన కలలు కళ్ళలో కదలాడి ,
ఇలలోకొచ్చి పరికిస్తే........
లోయల అంచున నిలుచున్నాం .
ఆత్మావలోకనం చేసుకుని ,
మనసును మనసు హత్తుకుని ,
చేతిలో చేయి పట్టుకుని ,
అడుగులో అడుగు వేసుకుని ,
అన్నీ ఒకటిగ చేసుకుని ,
ఆనందభాష్పాలు తుడుచుకుని ,
ఆదర్శ జంట అవుదాము .
మన కలలు కళ్ళలో కదలాడి ,
ఇలలోకొచ్చి పరికిస్తే........
లోయల అంచున నిలుచున్నాం .
ఆత్మావలోకనం చేసుకుని ,
మనసును మనసు హత్తుకుని ,
చేతిలో చేయి పట్టుకుని ,
అడుగులో అడుగు వేసుకుని ,
అన్నీ ఒకటిగ చేసుకుని ,
ఆనందభాష్పాలు తుడుచుకుని ,
ఆదర్శ జంట అవుదాము .
*******
మంచి ఆలోచన,ఆచరణ కూడా.
ReplyDeleteఇలా ఎన్ని జంటలు ఆలోచిస్తున్నాయి?
దేవీ మంచి కవిత మీదైన శైలిలో.
మీరజ్ మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు.
Deleteమంచి కవితను అందించారు
ReplyDeleteపద్మార్పితా మీ అభినందనలకు ధన్యవాదములు.
Deleteకారణాలేవైనా
ReplyDeleteఏ సంబంధాల్లోనైనా
చిరు వైషమ్యాలు
తలెత్తడం సహజం
నిజానికవి వారి వారి
స్వభావపు పరిణామాలే కాని
తప్పులుగా పరిగణించలేం.
కావాల్సిందల్లా
ఒండొరుల
స్వభావాల్ని
గుర్తెరిగి
మెలకువలకు
అణకువ జత చేసి
అలవోకగా
జీవితపు ప్రతీ మజిలీలోని
ప్రతి మలుపులోనూ
మాధుర్యాల్నె చవి చూడొచ్చు .
చెలిమి వీడని చేతుల బలిమి
చెదిరిపోని ఆనందపు కలిమి..
చెరిగిపోని కలల చెలిమి .....
Deleteజానీగారు,మీ కవితాభినందనలకు ధన్యవాదములు.
కొంతమందినైనా ఈ ఆత్మావలోకనం మార్చగలదని ఆశిస్తున్నాను . నైస్ .
ReplyDeleteఅలా జరిగితే నిజంగా ఎంత సంతోషంగా వుంటుందో మాటలలో చెప్పలేమేమో శర్మగారు,మీ అభినందనలకు ధన్యవాదములు.
Delete