Tricks and Tips

Friday, April 4, 2014

నిత్య పెళ్ళికొడుకువు నీవు ..........!!!!

మా గుండెను మండే కొలిమిని చేసి ,
మా కడుపును రగిలే కుంపటి చేసి ,
మా కళ్ళను చింత నిప్పులు చేసి ,
మా మనసున మాయని గాయం చేసి ,

నీవు మనసులో విషమును  దాచుకుని ,
చక్కని పథకం వేసుకుని ,
మరో అబలను బలిగావించుటకు  సిద్ధముగ ,
 నగనట్రా , పొలముపుట్రా బేరసారములాడుకుని ,
కట్నకానుకలు పుచ్చుకుని ,

నుదుటిన బాసికం కట్టుకుని ,
పట్టు పీతాంబరములు చుట్టుకుని ,
కాళ్ళకు పారాణి పెట్టుకుని ,
బుగ్గన చుక్కను దిద్దుకుని ,

ముఖాన నవ్వు పులుముకుని ,
చేతిలో తాళి పట్టుకుని ,
మారు మనువుకు పూనుకుని ,
మంగళ వాద్యముల నడుమన నీవు ,
మంగళసూత్రం ముడివేశావా .....?

మా మాటలు నమ్మే వారు లేరు ,
నీ మాటలు నమ్మని వారు లేరు ,
నివురు గప్పిన నిప్పువు నీవు ,
నిత్య పెళ్ళికొడుకువు నీవు ..........!!!!

*************



5 comments:

  1. దీన్ని కవిత అనుకోమంటారా ఐతే?

    పేరాని నిలువుగా రాస్తే కవిత అయిపోదని గ్రహించండి. పోనీ వస్తువేదైనా ఉంటే అదీ లేదు.

    నివురు గప్పిన నిప్పు అనేది మోసగాళ్ళకు వాడే ఉపమానం కాదు. ఇది కూడా తెలీకుండా కవిత్వానికి దిగడమే

    ReplyDelete
    Replies
    1. సత్యదృష్టిగారు నా బ్లాగుకు స్వాగతం. నేను కవినని కానీ,నాది కవిత్వమనిగానీ నేనేమీ చెప్పలేదు,కేవలం సమాజంలో జరిగే వాటి గూర్చి నా అభిప్రాయాన్ని నా బ్లాగులో,నాకు వచ్చిన రీతిలో వివరించాను అంతే.దానిలో కవితా లక్షణాలు లేకపోవచ్చు,ఉన్నాయని నేను బల్లగుద్ది చెప్పలేదే .....ఏదేమైనా మీ విమర్శకు ధన్యవాదములు.

      Delete
    2. సత్యదృష్టిగారు బ్లాగులో వారి భావాలను ,వారికి నచ్చిన విధముగా రాసుకుంటారు, విమర్శ మంచిదే కానీ వారిని అతిగా విమర్శించడం తగదని నా అభిప్రాయం.

      Delete