Tricks and Tips

Sunday, April 13, 2014

దోబూచులాడగ నాతో నీవు........

నీ కొరకే నే వచ్చానంటూ ,
నా మనసును దోచిన దొంగవు నీవు .

దోబూచులాడగ నాతో నీవు ,
దొరబాబులా వచ్చేస్తావు .

చిరునవ్వుల వరములునీయగ నాకు ,
చిలిపిగ చెంతకు పిలిచేస్తావు .

వీడని నీడలా తోడుంటానంటూ ,
నా చేతిలో ఒట్టు పెట్టేస్తావు .

కనురెప్పలు వేయక చూస్తూ నన్ను,
హాయిగ జోలను పాడేస్తావు .

ఆదమరచి నే నిదురించగనే ,
నను ఒంటరి చేసి పోతావు .

కలత నిద్దురలో నే కదలగనే ,
చిరుగాలితో నను ఏమారుస్తావు .

కనులు తెరిచి నే చూడగనే ,
కలలా కరిగిపోతావు .

మాయ ముచ్చట్లతో నను మోసపుచ్చి ,
దొంగలా పారిపోతావు .

అందుకే......

దొరబాబుల నీవు వేంచేయగనే ,
దొరసానిలా నీ ఒడి చేరుకుని ,

నీ ఒట్టును నిజమే చేయగ నేను ,
ఈ రాతిరి తోడుగ ఒచ్చేసాను ,


అందాల ఓ చందమామ ,
నీ చల్లని వెన్నెల నేనే మామా....

********

4 comments:

  1. అద్బుతంగా ఉంది, మీ మామతో మీ ప్రయాణం.
    జాగ్రత్త అమావాస్యకు అంతుచిక్కడు:-))

    ReplyDelete
    Replies
    1. ఇంత మంది నా చుట్టూ ఉంటే అంత ధైర్యం చేస్తాడా?నన్ను వదిలినా,నే వదలనుగా....అహ్హహ్హ

      Delete
  2. నమస్తే శ్రీదేవి గారు, నా పేరు చైతన్యకుమార్‌ సత్యవాడ. నేను మీ నూజివీడుకు సమీపంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో స్కూల్‌ అసిస్టెంట్‌ (పిజికల్‌సైన్సెస్‌) టీచర్‌గా పనిచేస్తున్నాను. ఈ రోజే మీ వెబ్‌ బ్లాగ్‌ను చూసాను. మీరు వ్రాసిన కవితలు బాగున్నాయి. ఒకసారి పలకరింపుగా కామెంట్‌ పెట్టాలనిపించింది. మీరు టీచర్‌ అని గూగుల్‌ప్లస్‌లో చూసాను. నా నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగు చూశారు కదా., నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షలకు ఉచితంగా మెటీరియల్‌ అందించే వేదికగా దాన్ని మలచాలన్న సత్సంకల్పంతో ప్రారంభించాను. మీరూ మీ సబ్జక్టు కు సంబంధించి మెటీరియల్స్‌ రూపొందించి అందించవచ్చు.వాటిని మీ పేరు ఫోటోతో సహా నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగులో ప్రచురిస్తాను.
    మీ
    చైతన్యకుమార్‌ సత్యవాడ
    ఫోన్‌ 9441687174

    ReplyDelete
    Replies
    1. చైతన్యకుమర్ గారు, మీ స్పందనకు ధన్యవాదములు.తప్పకుండా నా వంతు సహకారం మీకు అందిస్తాను.

      Delete