Tricks and Tips

Saturday, April 5, 2014

సిరాక్షరములను ఆపలేక.....

అక్షరాలు నాలుగు ఏరుకుని ,
పదాలు నాలుగు పేర్చుకుని ,
వాక్యాలు నాలుగు కూర్చుకుని ,

నాదైన శైలిలో రాసేస్తూ ,
నాదైన బాణిలో పలికేస్తూ ,
నాదైన భావన వివరిస్తూ ,

నాలోని ఆనందాన్ని పంచేస్తూ ,
నాలోని ఆవేశం తెలిపేస్తూ ,
నాలోని ఆక్రోశం నివేదిస్తూ ,

శిలాక్షరములుగా శాసించలేక ,
రక్తాక్షరములుగా లిఖించలేక ,
సిరాక్షరములను ఆపలేక ,

నారికేళపాకమును అందుకోలేక ,
ద్రాక్షాపాకమును చేరుకోలేక ,
కదళీపాకమును ఆస్వాదిస్తూ ,

కడవరకు నా బ్లాగ్మిత్రులతో
నా కలమూ , నేనూ నడవాలని ,
కలసిమెలసి సాగాలని ఆశిస్తూ ...
 
*******






6 comments:

  1. అక్షరాలు నాలుగు పదాలు పేర్చుకుని
    తనదైన శైలిలో, తనదైన బాణిలో, తనదైన భావనను .... ఆనందాన్ని, ఆవేశాన్నీ, ఆక్రోశం నివేదిస్తూ
    ఎన్నో జానపదులు, అందమైన భావనల ఆస్వాదనకు కారణం అవుతున్న శ్రీదేవికి అభినందనలు

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభిమానంతో కూడిన ప్రోత్సాహానికి ధన్యవాదములు.

      Delete
  2. తప్పకుండా మాతో నడవండి, మీ భావాలను మాతో పంచుకోండి,
    ఇతరుల భావాలను ,సున్నితత్వాన్నీ అంతే సున్నితంగా తీసుకోండీ,
    "నేను కవిని కాదూ అన్నారు(వెనుకటి కవితకిచ్చిన వాఖ్యలో) నిజమే మీరు కవి కాదు మంచి కవయత్రి అదిమాత్రం మరచిపోకండి:-)) మీ భావాలెప్పుడూ ఆదర్శాలే దేవీ.(విమర్శలను కూడాఅ సున్నితముగా స్వీకరించారు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.

      Delete
  3. విమర్శలనేవి ఒకరకంగా ఉత్ప్రేరకాలే .
    రాసుకున్న రాతల్లో పదాల కన్నా పదార్ధం
    రాణిస్తుంది .
    కలమూ కరమూ కవనమూ
    వీటి శైలి రాసేవారి అందరిలోనూ
    భిన్నంగానే ఉంటుంది ఉండాలి కూడా
    మీరు మీ శైలిలోనే అద్భుతంగా రాస్తున్నారు శ్రీదేవిగారు

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు జానీగారు,మొత్తానికి అందరూ నా పాజిటివ్ ధోరణిని పెంచారు.

      Delete