నీ ఆలోచనల ప్రాకారములో ,
మన జీవనవన సుమసౌరభాలు
నిత్య వసంతముగా అలరారాలని ,
నేనల్లుకున్న ఆశలతీవెలు
సాగుతు నా పొదరిల్లల్లగ......
నా గర్భములోని నీ ఆకారముతో ,
మన జీవితాశయ లక్ష్యాలను ,
నిత్యనూతనముగ వివరించాలని ,
నే కన్న కలలను సాకారము చేసే
కమనీయ కథలను వినిపిస్తుండగ......
నీవు విలాసాల మత్తులో మునిగి తేలుతూ ,
మమకారపు విలువలు మరచిపోయి ,
వేరేదో సౌఖ్యం వెదికే వెర్రితో ,
వెంపర్లాడుతు మమ్ము విడచిపోయిన నీకు ,
నీవు పోగొట్టుకున్నదేమిటో తెలియచెప్పనా.....
నీ తల్లి ప్రతిబింబంలా కిలకిలలాడే పాపాయిని ,
"నాన్నా" అని నోరారా పిలిచే పిలుపులను ,
నీకై వెతికే మిలమిలలాడే కన్నులను ,
నువ్వు చెప్పే ఊసులకు ఊకొట్టే బుల్లి పెదవులను ,
నీ గుండెల్లో దూరి ఊకొడుతూ బజ్జొనే బుజ్జాయిని.......
ఇంతకు మించి నీవు పొందినదేమైన ఉందా....?
నీ వెంపర్లాటకు ఫలితం ఉందా....?
నీ జీవితానికి ఓ అర్ధం ఉందా....?
కన్నతల్లిగ ప్రేమను పంచి
"అమ్మ"కు అర్ధం నేనయ్యాను ,
నా జీవిత పరమార్ధం నెరవేర్చగ ,
నడుముకట్టి నే బయలుదేరాను .
*******
మన జీవనవన సుమసౌరభాలు
నిత్య వసంతముగా అలరారాలని ,
నేనల్లుకున్న ఆశలతీవెలు
సాగుతు నా పొదరిల్లల్లగ......
నా గర్భములోని నీ ఆకారముతో ,
మన జీవితాశయ లక్ష్యాలను ,
నిత్యనూతనముగ వివరించాలని ,
నే కన్న కలలను సాకారము చేసే
కమనీయ కథలను వినిపిస్తుండగ......
నీవు విలాసాల మత్తులో మునిగి తేలుతూ ,
మమకారపు విలువలు మరచిపోయి ,
వేరేదో సౌఖ్యం వెదికే వెర్రితో ,
వెంపర్లాడుతు మమ్ము విడచిపోయిన నీకు ,
నీవు పోగొట్టుకున్నదేమిటో తెలియచెప్పనా.....
నీ తల్లి ప్రతిబింబంలా కిలకిలలాడే పాపాయిని ,
"నాన్నా" అని నోరారా పిలిచే పిలుపులను ,
నీకై వెతికే మిలమిలలాడే కన్నులను ,
నువ్వు చెప్పే ఊసులకు ఊకొట్టే బుల్లి పెదవులను ,
నీ గుండెల్లో దూరి ఊకొడుతూ బజ్జొనే బుజ్జాయిని.......
ఇంతకు మించి నీవు పొందినదేమైన ఉందా....?
నీ వెంపర్లాటకు ఫలితం ఉందా....?
నీ జీవితానికి ఓ అర్ధం ఉందా....?
కన్నతల్లిగ ప్రేమను పంచి
"అమ్మ"కు అర్ధం నేనయ్యాను ,
నా జీవిత పరమార్ధం నెరవేర్చగ ,
నడుముకట్టి నే బయలుదేరాను .
*******
:-):-)
ReplyDeleteThank you sir................
Deleteమాత్రుత్వాన్ని మించిన భాగ్య ఆడదానికుండదు, మరో మనువును మించిన జాడ్యం మగవానికుండదూ(అందరికీ కాదు సుమా)
ReplyDeleteమంచి కవిత,
మీ విశ్లేషణాత్మకమైన ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు మీరజ్
Delete