Tricks and Tips

Tuesday, April 22, 2014

నా నిశ్శబ్ధ నీరాజనం...._/\_

నా స్తబ్ధ ప్రపంచంలోనికి చిరుగాలిలా
చొచ్చుకుని వచ్చిన శబ్ధానివి ,

నా నిశ్శబ్ధాన్ని తెరలా మెల్లగా
ప్రక్కకు తొలగించిన సుశ్శబ్ధానివి ,

నీ చిరునవ్వులతో కూడిన శబ్ధం ,
నీ చిరుమువ్వలతో కూడిన శబ్ధం ,
నీ చేతి గాజులతో కూడిన శబ్ధం ,
నీ చిలుక పలుకులతో కూడిన శబ్ధం ,

నీ చిరు అలకలతో కూడిన శబ్ధం ,
నీ చిరు వలపులతో కూడిన శబ్ధం ,
నీ చిరు మందలింపులతో కూడిన శబ్ధం ,
నీ చిరు బెదిరింపులతో కూడిన శబ్ధం ,

నీ కూనిరాగాలతో కూడిన శబ్ధం ,
నీ వీణానాదాలతో కూడిన శబ్ధం ,

శబ్ధానికి ఓ మధుర నిర్వచనమిచ్చి ,
శబ్ధానికి ఓ సుస్వరాన్ని స్వర పరచి ,
ఆ శబ్ధతరంగాలు నాలో అలలై కదలగ ,
ఆ సుశ్శబ్ధాలకు నను రాజును చేసిన.....

ఓ శబ్ధార్ధాలంకృత శిరోమణీ ,
నీ సుశ్శబ్ధాలకిదే నా నిశ్శబ్ధ నీరాజనం .

**********


4 comments:

  1. శబ్ధానికి ఓ మధుర నిర్వచనమిచ్చి ,
    శబ్ధానికి ఓ సుస్వరాన్ని స్వర పరచి ,
    ఆ శబ్ధతరంగాలు నాలో అలలై కదలగ...
    భావ ప్రకంపనం వినసొంపుగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. మీ అపురూప భావ ప్రకటనకు ధన్యవాదములు పద్మార్పితగారు.

      Delete
  2. మీ కవితలోనే శబ్దం ఉంది,
    అందుకే అది అంత విందుచేస్తుంది.
    చక్కటి కవిత, చంద్రా బొమ్మలో అమరింది.

    ReplyDelete
    Replies
    1. చంద్రాగారి అందమైన బొమ్మ చేసేమధురమైన శబ్ధాన్ని అందరూ నిశ్శబ్ధంగా సంతోషంగా ఆలకించేస్తున్నారు మీరజ్.

      Delete