ప్రకృతిమాతకు శుభాకాంక్షలు
నీకివే జన్మదిన శుభాకాంక్షలు........
తల్లీ ! ప్రకృతిమాత నీపై ఆధార పడని
జీవి కలదె తరచి తరచి వెదకి వెదకి చూడ
నీవే సత్యం , నీవే నిత్యం , నీవే సమస్తం ,
నీవే జీవనాధారం , నీవే మా ప్రాణాధారం ,
కుల , మత , జాతి , లింగ , పేద , ధనిక విభేదాలు లేని
నీవంటి సహజ సుందర సువిశాల హృదయ
కరుణామృతమూర్తీ ! నీకు బిడ్డలం , మేమంతా నీ బిడ్డలం
నీ బిడ్డల శుశ్రూషలో అలసి సొలసి
షడ్రుచుల సమ్మేళన సమయంలో
సమతుల్యాన్ని గమనించక గతించిన కాలంలో
ఆదమరచి రెప్పపాటు కాలం కనురెప్పలార్పినావా ?
అమ్మా ! ఆ క్షణం చాలునన్నట్లు
వికృతిమాత కురులు విదిల్చి , ఒడలు విరిచి
వేంచేసి వికట్టాట్టహాసం చేస్తూ షడ్రుచులలో
చేదు పాళ్ళు పెంచి , ఇనుప గజ్జె కట్టి
విలయతాండవం చేసిన పర్యవసానమే...
ఈ రాష్ట్ర విభజనలు , రైతన్నల రోదనలు ,
నేత కార్మికుల వెతలు , నిరుద్యోగుల నిస్పృహలు ,
కన్నవారి కడుపు కోతలు , ప్రజలపై "పన్ను" పోటులు ,
సామాన్య ప్రజల లబ్ధి పథకాలపై నేతల కోతల వాతలు ,
వరకట్న పిశాచాలు , నింగికెగసిన ధరలు ,
పేదవాని పెడబొబ్బలు , సారాసురుని వీరంగాలు ,
నేతల నాలుగు స్థంభాలాటలు , అన్నార్తుల ఆర్తనాదాలు ,
ఆడపిల్లలపై అత్యాచారాలు , అఘాయిత్యాలు , హత్యలు ,
పగలు , ప్రతీకారాలు , బంద్ లు , ఘెరావ్ లు , రాస్తారోకోలు
ఇలా.....ఎన్నెన్నో ఆకాశంలో చుక్కలన్ని ,
సముద్రంలో నీటి బిందువులన్ని...................
తల్లీ ! నీ రెప్పపాటు కునికిపాటుతో
వికృతి ఎగురవేసిన విజయ కేతనాన్ని
నీ బిడ్డలం నిస్సహాయంగా ,నిర్వేదంగా ,నిశ్చేష్టులమై
చూస్తూ........... వెదుకుతున్నాం నీ ఒడిలో సేదతీరడానికి
నవనవోన్మేషమైన నీ ప్రకృతి శోభలతో తిరిగి
ఈ చైత్రారంభమున కొసరి కొసరి గున్నమామి
అథిది కోయిలమ్మలకు చిగురులందించగా
ఆస్వాదించిన కోయిలమ్మ తన తీయని రాగాలాపనతో
ప్రకృతి మాతను పరవశింప జేయగా
చిరుమువ్వల మరుసవ్వడితో విచ్చేసిన
జయనామ నవయుగ ఆద్యంతం
జయజయ ధ్వానాలతో జయము కలిగించుచూ
ప్రజల జీవితాలు ఆనంద నందన వనముగ
సుమసౌరభాలతో విరాజిల్లుతూ ,షడ్రుచుల సమ్మేళనలో
ఏమరపాటుకు తావీయక అనిమేషంతో
సమతుల్యం చేసి నీ బిడ్డల ఆనందమునే
నీ జీవితానందముగా భావిస్తావని ఆశిస్తూ
ఈ జయ నామ సంవత్సరం అజేయముగా నిలవాలని
ఆనందంగా స్వాగతిస్తున్నాం....
జయములిచ్చు జయ నామ సంవత్సరమా !
స్వాగతం , సుస్వాగతం .
************

ప్రతి కృతీ ప్రకృతి ప్రసాదించిందే
ReplyDeleteవిష వికృతి విపరీతపు పోకడలేన్ని పోయినా
చివరికి ఆదుకునేదీ చేరుకునేదీ ప్రకృతి మాత పవిత్ర వొడే
శృతి అపశృతయినా ,కృతి వికృతయినా ప్రకృతి మరి తల్లి కదా......అందుకే ఒడి చేర్చుకుంటుందేమో జానీగారు.
DeleteChaalaa baagundi:):)
ReplyDeleteThank you kaarteek gaaru.
Delete