పుట్టిందీ పుడమి తల్లి వడిలోనే మెట్టిందీ ఆ తల్లి వడికే ఆశలూ ఆశయాలూ కుట్రలూ కష్టాలూ కలలూ కల్లలూ బంధాలూ బరువులూ బాధ్యతలూ బలాలూ బలహీనతలూ ఆప్యాయతలూ అనురాగాలూ త్యాగాలూ యాగాలూ కన్నీళ్ళూ పన్నీళ్ళూ స్వార్ధాలూ మనస్పర్ధలూ అధికారాలూ అందలాలూ అందాలూ ఆస్వాదనలూ నిరాశలూ నిస్ప్రుహలూ కాలానికి గాలం వేసి కాలానికే చిక్కి అలసి సొలసిన తనువును ఆత్మ వీడినా ఆత్మీయంగా ఆ తల్లి మళ్ళీ తన వొళ్లోనే శాశ్వత ఆశ్రయం ఇచ్చే శ్మశానానికి మించిన పవిత్ర స్థలం ఏదీ లేదు వాస్తవికతకు అద్దం పట్టారు శ్రీదేవి గారు..
అక్షరాలు ఎంత తక్కువైతేనేం భావం సంద్రమంత..
ReplyDeleteబావుంది శ్రీదేవి గారూ
రాధికగారు మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteశివానికైనా శవానికైనా ఆధారం ఆ నేలతల్లి చాలా బాగుంది మీ చిన్ని కవిత
ReplyDeleteహరిత మీ స్పందన వాస్తవమే, ధన్యవాదములు.
Deleteపుట్టిందీ పుడమి తల్లి వడిలోనే
ReplyDeleteమెట్టిందీ ఆ తల్లి వడికే
ఆశలూ ఆశయాలూ
కుట్రలూ కష్టాలూ
కలలూ కల్లలూ
బంధాలూ బరువులూ బాధ్యతలూ
బలాలూ బలహీనతలూ
ఆప్యాయతలూ అనురాగాలూ
త్యాగాలూ యాగాలూ
కన్నీళ్ళూ పన్నీళ్ళూ
స్వార్ధాలూ మనస్పర్ధలూ
అధికారాలూ అందలాలూ
అందాలూ ఆస్వాదనలూ
నిరాశలూ నిస్ప్రుహలూ
కాలానికి గాలం వేసి
కాలానికే చిక్కి
అలసి సొలసిన తనువును
ఆత్మ వీడినా
ఆత్మీయంగా
ఆ తల్లి
మళ్ళీ తన వొళ్లోనే
శాశ్వత ఆశ్రయం ఇచ్చే
శ్మశానానికి మించిన
పవిత్ర స్థలం ఏదీ లేదు
వాస్తవికతకు
అద్దం పట్టారు శ్రీదేవి గారు..
మీరే చాలా బాగా చెప్పారు జానీగారు ధన్యవాదములు.
Deleteశివము వీడిన శరీరము
ReplyDeleteశవమై ,శవపేటిక నాశ్రయించగా
చాలా బాగుంది భావన
అభినందనలు శ్రీదేవీ!!
చంద్రగారు ధన్యవాదములు మీ స్పందనలకు.
Deleteఅద్భుతమైన భావన, దేవి మాత్రమే రాయగల చిన్ని సందేశం.
ReplyDeleteనా భావనలు మహాసముద్రంలో నీటిబొట్టంత.మీరజ్ ధన్యవాదములు మీ స్పందనకు.
Delete