అమ్మా ! అక్కలా నాకూ పెళ్ళి కావాలమ్మా........
పచ్చని పట్టుచీర కట్టు ,
బొట్టు , కాటుక చక్కగ పెట్టు ,
జడకు మల్లెలు బాగా కుట్టు ,
కాళ్ళకు ఎర్రగ పారాణి పెట్టు ,
చేతుల నిండా గోరింట పెట్టు ,
గాజులు , గొలుసులు ఎక్కువ పెట్టు ,
బుగ్గన నల్లని చుక్కను పెట్టు ,
పీపీ ,ఢుంఢుం బాజా పెట్టు ,
బొట్టు , కాటుక చక్కగ పెట్టు ,
జడకు మల్లెలు బాగా కుట్టు ,
కాళ్ళకు ఎర్రగ పారాణి పెట్టు ,
చేతుల నిండా గోరింట పెట్టు ,
గాజులు , గొలుసులు ఎక్కువ పెట్టు ,
బుగ్గన నల్లని చుక్కను పెట్టు ,
పీపీ ,ఢుంఢుం బాజా పెట్టు ,
అమ్మా ! అక్కలా నాకూ పెళ్ళి కావాలమ్మా..........
బుజ్జితల్లీ ! మరి అక్కలా నీవు కూడా మీ ఇంటికి వెళ్ళిపోతావా ?
అమ్మో ! అమ్మా ,అక్కలా వెళ్ళిపోవాలా..........
ఊ....ఊ....వద్దు...వద్దు....నే వెళ్ళనమ్మా........
బుజ్జితల్లీ ! మరి అక్కలా నీవు కూడా మీ ఇంటికి వెళ్ళిపోతావా ?
అమ్మో ! అమ్మా ,అక్కలా వెళ్ళిపోవాలా..........
ఊ....ఊ....వద్దు...వద్దు....నే వెళ్ళనమ్మా........
నాకు నువ్వే కావాలమ్మా........
యూనీఫాం చకచక వేసెయ్ ...
రెండు జడలు చక్కగ దువ్వెయ్ ...
బ్యాగ్ లో బుక్స్ సర్దేసేసెయ్ ....
లంచ్ , వాటర్ ఇచ్చేసేసెయ్ .....
గబగబ బడికి పంపించేసెయ్....
చక్కగ నన్ను చదివించేసెయ్....
చందమామను చూపించేసెయ్....
పాలబువ్వను తినిపించేసెయ్....
నీ ఒడిలో ఊయల ఊగించేసెయ్....
జోలపాటను పాడేసేసెయ్......
హాయిగ నన్ను బొజ్జోపెట్టెయ్.......
నాకు నువ్వే కావాలమ్మా........
**********
యూనీఫాం చకచక వేసెయ్ ...
రెండు జడలు చక్కగ దువ్వెయ్ ...
బ్యాగ్ లో బుక్స్ సర్దేసేసెయ్ ....
లంచ్ , వాటర్ ఇచ్చేసేసెయ్ .....
గబగబ బడికి పంపించేసెయ్....
చక్కగ నన్ను చదివించేసెయ్....
చందమామను చూపించేసెయ్....
పాలబువ్వను తినిపించేసెయ్....
నీ ఒడిలో ఊయల ఊగించేసెయ్....
జోలపాటను పాడేసేసెయ్......
హాయిగ నన్ను బొజ్జోపెట్టెయ్.......
నాకు నువ్వే కావాలమ్మా........
**********
ఓహో మా బుజ్జిది అక్కడికొచ్చి
ReplyDeleteఇలా గారాలు పోతుందా
చూశారా కాస్త ఏదో తోడి పెల్లికూతురిగా సింగారిస్తే అప్పుడే ఆరిందా అయిందా
హహహ మీరు భలే బుజ్జగించారు
చూసారా చిన్న పాపకున్న పరిపక్వత
పెద్దలకు లేకుండా పసిమోగ్గలను
పసుపుతాడు పాలు చేసి
పాలుగారే బుజ్జయిలను
బుగ్గిపాలు చేస్తున్నారు
బాగుంది శ్రీదేవి గారు
ప్రహసనమైనా చక్కటి
ప్రవచనమిది.
మరి బుజ్జి పాపలను మనం అనునయించే తీరుపైనే వాళ్ళ పరిపక్వత ఆధారపడి వుంటుంది జానీగారు....మీ బుజ్జిపాప గడుసుది కూడా,తను చదువుకుంటూ నాతో కవిత రాయించేసింది. జానీగారు మీరు మీ చిత్రం ఇచ్చినందుకు ధన్యవాదములు.
Deleteమీ అభినందనలకు ధన్యవాదములు.
చాలా బాగా వ్రాసారు. అభినందనలు.
ReplyDeleteశ్యామలీయంగారు మీ అభినందనలకు ధన్యవాదములు.
Delete"అమ్మా ! అక్కలా నాకూ పెళ్ళి కావాలమ్మా.........."
ReplyDelete"బుజ్జితల్లీ! మరి అక్కలా నీవు కూడా మీ ఇంటికి వెళ్ళిపోతావా?"
"అమ్మో ! అమ్మా ,అక్కలా వెళ్ళిపోవాలా..........
ఊ....ఊ....వద్దు...వద్దు....నే వెళ్ళనమ్మా........
నాకు నువ్వే కావాలమ్మా........"
ఊహ త్లియని పసి మనసు ఆలోచనల్ని కవిత లా .... చాలా బాగా రాసావు
అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు అభినందనలకు సంతోషం.
Delete
ReplyDelete"ఏమిటో ఈ పిచ్చి పిల్ల ! ఇప్పుడు నాకు నువ్వే కావాలమ్మా అంటుంది కాని, వయసొస్తే అబ్బాయి తో చెంగుమని ఎగిరి పోదూ !!
చీర్స్
జిలేబి
జిలేబీగారు అభినందనలకు సంతోషం.
Deleteఏ వయసుకు తగినట్లు ఆ వయసులో ఉండాలి కదండి.అప్పుడు వెళ్ళనంటే తల్లిదండ్రులు ఊరుకోరు కదండీ....
పసి హృదయాన్ని పసి గట్టారు,
ReplyDeleteవసివాడకుండా, పన్నీటి మడి కట్టారు.
అభినందనలు దేవీ,చిత్రకారునికి కూడా.
మీ కవితాభినందనకు ధన్యవాదములు మీరజ్.
Deleteచిన్నవయసులో పిల్లల ఆలోచనలకు చక్కగా అద్దం పట్టారు,చిత్రం కూడా చాలా ముద్దుగా ఉంది.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదములు.
Delete