దైవమును నమ్మిన వారు ,
దయ్యమును నమ్మక తప్పదు .
దేవుని వెనుక రాక్షసులున్నట్లే
దైవం వెనుక దయ్యం ఉంటుంది కదా .....
అవును , ఈ మధ్య మనసు దయ్యంపై మళ్ళుతోంది ,
ఆలోచనలను సుళ్ళు తిప్పుతోంది .
దయ్యం ఉన్నది వాస్తవమైతే ,
ఆత్మలు అన్నవి నిజమే అయితే ,
ప్రేతాత్మలు , పిశాచాలు కూడా నిజమే...
బలవన్మరణం పొందిన వారు ,
ఆశలు తీరక చనిపోయిన వారు ,
ఆత్మలై తిరుగుతారంటుంటారు...
అదే నిజం అయితే కనుక ,
ఇందరి ఆడపిల్లలను రొష్టుపెట్టి ,
నడి వీధిలో నరకం చూపిన వాడికి...
ఆ ఆడపిల్లల ఆత్మలు ప్రేతాత్మలై ,
రక్కసి గోళ్ళతో పీక్కుతినవే.....
కంకాళ నృత్యం చేసి వాడి ,
ఆయువు తోడి తోడి పీడన చేయవే...
అడుగడుగన వారిని హింసించి ,
ఉన్మాదుల ఊపిరి మూసి , తీసి ఊయలలూపవే...
శాఖినీ , డాఖినీలు వారి నికృష్ట చేష్టలకు ,
కారణమైన భాగం నరకవే....
రక్తపిశాచాల రక్తం మరిగి ,
పళ్ళతో కొరికి రక్తం పీల్చి పీల్చి పిప్పి చేయవే...
కాష్మోరాలు కళ్ళు తెరిచి ,
కాళ్ళు , కీళ్ళు లాగేయవే...
కొరివి దయ్యాలు తరిమి , తరిమి
కొరివిని అంటిస్తూ తీస్తూ వినోదం చూడవే....
నిరతము వాడిని కాపాడే వారికి ,
కాళరాత్రులు చూపించవే .....
దైవమా నీవు రాక తప్పదు ,
ఈ దైత్యులను దునుమాడక తప్పదు....
లేని పక్షాన ప్రేతాత్మలకు శక్తులనీయక తప్పదు ,
అదే నరకం వారికీ చూపక తప్పదు....
ఆ నీచుల ప్రాణం తీయవద్దు ,
జీవించినంత కాలం నిర్భాగ్యులుగా , దౌర్భాగ్యులుగా ,
వికలాంగునిగా వీధులలోన నికృష్ట జీవనం గడపాలి ,
వారి తప్పులే నిరంతరం నిలువునా వారిని దహించి వేస్తూ ఉండాలి .
దయ్యమును నమ్మక తప్పదు .
దేవుని వెనుక రాక్షసులున్నట్లే
దైవం వెనుక దయ్యం ఉంటుంది కదా .....
అవును , ఈ మధ్య మనసు దయ్యంపై మళ్ళుతోంది ,
ఆలోచనలను సుళ్ళు తిప్పుతోంది .
దయ్యం ఉన్నది వాస్తవమైతే ,
ఆత్మలు అన్నవి నిజమే అయితే ,
ప్రేతాత్మలు , పిశాచాలు కూడా నిజమే...
బలవన్మరణం పొందిన వారు ,
ఆశలు తీరక చనిపోయిన వారు ,
ఆత్మలై తిరుగుతారంటుంటారు...
అదే నిజం అయితే కనుక ,
ఇందరి ఆడపిల్లలను రొష్టుపెట్టి ,
నడి వీధిలో నరకం చూపిన వాడికి...
ఆ ఆడపిల్లల ఆత్మలు ప్రేతాత్మలై ,
రక్కసి గోళ్ళతో పీక్కుతినవే.....
కంకాళ నృత్యం చేసి వాడి ,
ఆయువు తోడి తోడి పీడన చేయవే...
అడుగడుగన వారిని హింసించి ,
ఉన్మాదుల ఊపిరి మూసి , తీసి ఊయలలూపవే...
శాఖినీ , డాఖినీలు వారి నికృష్ట చేష్టలకు ,
కారణమైన భాగం నరకవే....
రక్తపిశాచాల రక్తం మరిగి ,
పళ్ళతో కొరికి రక్తం పీల్చి పీల్చి పిప్పి చేయవే...
కాష్మోరాలు కళ్ళు తెరిచి ,
కాళ్ళు , కీళ్ళు లాగేయవే...
కొరివి దయ్యాలు తరిమి , తరిమి
కొరివిని అంటిస్తూ తీస్తూ వినోదం చూడవే....
నిరతము వాడిని కాపాడే వారికి ,
కాళరాత్రులు చూపించవే .....
దైవమా నీవు రాక తప్పదు ,
ఈ దైత్యులను దునుమాడక తప్పదు....
లేని పక్షాన ప్రేతాత్మలకు శక్తులనీయక తప్పదు ,
అదే నరకం వారికీ చూపక తప్పదు....
ఆ నీచుల ప్రాణం తీయవద్దు ,
జీవించినంత కాలం నిర్భాగ్యులుగా , దౌర్భాగ్యులుగా ,
వికలాంగునిగా వీధులలోన నికృష్ట జీవనం గడపాలి ,
వారి తప్పులే నిరంతరం నిలువునా వారిని దహించి వేస్తూ ఉండాలి .
( అప్పుడు కాదా, ఆ ఆడపిల్లల తల్లులకు కొంత శాంతి లభించేది )
*********
*********
ఆ బిడ్డలు చనిపోయిన తర్వాత వారి కోసం ఏమో చేయటం కాదు,
ReplyDeleteదెయ్యాలాంటి శాసనాలూ, పిశాచాల వంటి చట్టాలల్తో , తప్పుచేసిన వాడిని పీక్కుతింటున్నాయి విదేశీ గవర్న్మెంట్స్ . పాపబీతీ, మానవ హక్కులూ అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయినా గొప్పింటి బిడ్డలంతా క్షేమమే కదా... ఇంకేం. శాంతి బద్రతలకు కొరవ లేదు.
మనం ఏమీ చేయలేని అసమర్ధ జీవనం గడుపుతున్నాం కదా , అందుకే ఆ ఆడపిల్లల ఆత్మలే సినిమాల్లో చూపిన విధంగా వాడికి నరకం చూపిస్తే బాగుండును అనిపించింది..........మీరజ్
Delete
ReplyDeleteచనిపోయిన తరువాతే కాదు ...అసలు బ్రతికున్నప్పుడే ఇటువంటి మ్రుగాళ్ళను ఎదురించే ధైర్యం ఆడ పిల్లలకు రావాలి దేవుడా....
ఆడపిల్లలు ఎప్పుడైతే తమ తల్లిదండ్రులకు ఉత్తమ స్థానాన్ని ఇస్తారో అప్పుడు,తల్లిదండ్రులు ఎప్పుడైతే సీరియల్స్ చూడడం మాని పిల్లల బాగోగులు పట్టించుకుంటారో అప్పుడు ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది....సమాజంలో కొంతవరకూ అకృత్యాలు తగ్గుతాయని నేననుకుంటున్నాను శ్రీనిధి.
Deleteఆడపిల్లల ఆత్మ శాంతి......
ReplyDeleteబ్రతికున్నన్నాళ్ళూ నరకాన్ని చూసి మరణించాక కూడా ప్రేతాలై కక్ష తీర్చుకోవాలని ఆశించడం లో కవయిత్రి కసి ఆవేదన అర్ధం అవుతున్నాయి. అలా కాకుండా ప్రతి పురుషుడు స్త్రీ గా ప్రతి స్త్రీ పురుషుడుగా మళ్ళీ జన్మిస్తే తనవల్ల అన్యాయం అయిన వ్యక్తుల క్షోభను అర్ధం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందేమో ....
మొత్తానికి ఆలోచనలు రేకెత్తించే మంచి కవిత
అభినందనలు శ్రీదేవీ!
నిజంగానే చాలా కసిగా ఉంది చంద్రగారు,సినిమాల్లోలా ఆత్మలు వారిని పీడిస్తే బాగుండును అనిపిస్తోంది నాకు.
Delete