Tricks and Tips

Thursday, March 27, 2014

ఇంక ఈ వయసులో వారు.............

ఇంక ఈ వయసులో వారు
ఇక దేనికి ఎదురు చూస్తారు ?


వారి వంక చూసి ఎవరైనా
చిన్న చిరునవ్వు నవ్వక పోతారా అని....

వారి చేతి మీద చేయి వేసి
ప్రేమగా స్పర్శించక పోతారా అని.....

పనులు చేసుకుంటూ వారి ముందు నుండి వెళ్ళినప్పుడు
ఓ క్షణం వారి చూపులో చూపు క
లుపక పోతారా అని.....

ఇంటికి వచ్చిన వారెవరైనా
తమను చూసి పలుకరించక పోతారా అని.....

మనవళ్ళు,మనుమరాళ్ళు ఆప్యాయంగా
తమ దగ్గర కూర్చోక పోతారా అని.....

కుటుంబంలో ఏ ఒక్కరైనా తమ కోసం
కొన్ని నిముషాలైనా కేటాయించక పోతారా అని.....

తమ చిన్ననాటి ముచ్చట్లు అడిగి
తమతో ముచ్చటించక పోతారా అని.....

తమ జీవితానుభవాలను తెలుసుకుని
తమ భావి జీవితాన్నిమలచుకోక పోతారా అని.....

ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు
పరిష్కారం తమను అడుగక పోతారా అని.....

తమ పిల్లల మీద ప్రేమతో
తాము ఆ ఇంట్లో ఓ వస్తువులా మారిపోయామని గుర్తించలేక ,
తమ అనుభవాలు వారికి పనికిరానివని వారనుకుంటున్నారని తెలుసుకోలేక ,
తమతో మాట్లాడే సమయం పిల్లలు పోటీపరీక్షకు
చదివే సమయాన్ని తగ్గించేస్తుందన్న వారి భావనను అర్ధం చేసుకోలేక .....


పిల్లల్లంతా ఈ రోజు తమ పనుల్లో మునిగిపోయారు
రేపు మాట్లాడించక పోతారా అనే
రేపటి మీద ఆశతో జీవిస్తున్న వారెందరో..... 

***********








6 comments:

  1. ఆశాజీవులం

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ స్పందనలకు ధన్యవాదములు.ఈ రోజు మీరు,రేపు మేము అంతే తేడా......

      Delete
  2. అందరమూ..,ఆశాజీవులమే.
    కానీ ఈ రక్తసంబంధాలకు మరీ ఎక్క్కువ విలువిచ్చ్హి, జీవితకాలాన్ని వారికే వెచ్చించే స్థాయి నుండి కొన్ని దేశాలు (కొన్ని అనుబవాల ఆధారంగా) మెరుగుపడ్డాయి, ఆత్మీయులు మాట్లాడితే చాలని వారి ఓ చిరునవ్వుకోసం వేచి ఉండక ఓ పెంపుడుజంతువుతో నైనా గడిపేస్తున్నారు. అర్దమ్లేని,అక్కరలేని బంధాలను పట్టుకొని వేలాడకూడదు.
    పోస్ట్ ఎప్పటిలా బాగుంది దేవీజి

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా!మీరజ్ సరే,మీరెప్పుడూ విశ్లేషణాత్మకంగానే చెబుతారుగా.

      Delete
  3. వయసుడిగి సత్తువ కోల్పోయి నీరసంగా మంచానికి అతుక్కుపోయినప్పుడు ఏ అనురాగమైనా చనువుగా పక్కన కూర్చుని మీద చెయ్యి వేసి ఎలా ఉన్నావు? అని అడిగే ఆత్మీయత దొరక్క కోల్పోయిన బాధను తగ్గించే మనసులు కావాలి.
    బాగా రాసావు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ఓ చిన్న స్పర్శ,పలకరింపు ఎంత నమ్మకాన్నిస్తాయో తెలియ చెప్పే బాధ్యత ఎవరూ తీసుకోవదం లేదు,తీసుకుందామన్నా మీడియా ప్రభావం ముందు ఇవి నల్లపూసలై పోతున్నాయి.చంద్రగారు మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete