Tricks and Tips

Monday, March 17, 2014

నా ప్రియసఖిని ...తీసుకు రావా ?

ఓ శ్వేతవర్ణ కపోతమా !
 
ఒక్కసారిగా నీ రెక్కలను అల్లల్లార్చి
 ఆ పచ్చని వర్ణం భూమాతకిచ్చి ,
ఆ కరిమబ్బుల నీడలో నిలిచిన మాకు...
నీలోని రంగులన్నీ హోళీకేళీ వినోదానికి అంకితమిచ్చావా ?

ఓ శ్వేత ప్రేమపావురమా !

ఆ సింధూర వర్ణం నుదుటికి ఇచ్చి ,
ఆ నీలి వర్ణం కనులకు ఇచ్చి ,
ఆ గులాబి వర్ణం చెక్కిళ్ళకిచ్చి ,
ఆ పగడపు వర్ణం పెదవులకిచ్చి ,
ఆ ముత్యపు వర్ణం పలువరుసకిచ్చి ,
ఆ మెరుపు వర్ణం చిరునగవులకిచ్చి ,
ఆ బంగరు వర్ణం మేనికిచ్చి ,
ఆ పసుపు వర్ణం పాదాలకిచ్చి ,
నీ శ్వేత వర్ణం మనసుకిచ్చి ,
నాతో హోళీకేళీ ఆడి మురియగ ,


నా ప్రియసఖిని నీతో తీసుకు రావా ?

*******

8 comments:

  1. very very beautiful.. happy holi sreedevi gaaru

    ReplyDelete
  2. చాలా బాగుంది, అన్నిరంగులనూ కలబోసితెమ్మన్న ప్రియసఖి,
    పదాలలో ఓ అమరికా, సున్నిత భావమూ మీ సొత్తు, అభినందనలు దేవీ.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనాభిమానాలకు ధన్యవాదములు మీరజ్.

      Delete
  3. ఒక్కసారిగా నీ రెక్కలను అల్లల్లార్చి
    ఆ పచ్చని వర్ణం భూమాతకిచ్చి ,
    ఆ కరిమబ్బుల నీడలో ......

    ఓ .... పావురమా !
    చాలా బాగుంది శుభోదయం శ్రీదేవీ!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనలకు సంతోషం.

      Delete