Tricks and Tips

Tuesday, March 25, 2014

ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......


ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......
ఆ పిన్న వయసులో పెద్ద ఆవేదనా ,
ఇన్ని అసమానతలు కళ్ళ ముందు కనపడుతుంటే ?
గుప్పెడు మెతుకులు అందనినాడు ,
జానెడు వసతి లేని నాడు ,
మూరెడు బట్ట దొరకనినాడు ,
అమ్మానాన్న తెలియనినాడు ,
గుక్కెడు నీరు పుట్టని నాడు ,
తోబుట్టువు ఆకలి తీర్చని నాడు ,
ప్రశ్నకు జవాబు దొరకని నాడు ,
బతుకు బండి కదలని నాడు ,
ఛస్తూ బతుకును ఈడ్చిన నాడు ,
తోటి మానవ హృదయం స్పందించని నాడు ,

ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......

***********





 

6 comments:

  1. అసలు వాడి దగ్గరికి బాల్యమేపుడోచ్చిందీ
    పుట్టగానే కష్టాల పుట్ట
    కళ్ళెదుట కనబడి
    పెద్దోడ్ని చేసేసి
    బతుకు బండి ఇరుకు ఇరుసుకు
    ఒరుసుకునేలా ..
    రాళ్ళ కుప్పల్లో రాయిలా మార్చింది
    హృద్యంగా ఉంది శ్రీదేవిగారు.

    ReplyDelete
    Replies
    1. నిజంగానే జానీగారు,వారికి అందమైన బాల్యం ఒకటుంటుందని తెలియకనే తరాలు తరలి పోతున్నాయి.

      Delete
  2. సమాజం పట్ల మీకున్న మానవతా దృక్పథం చాలా గొప్పది శ్రీదేవి గారు . మీ కవిత మీలోని బాధ్యతా హిత
    వైఖరిని తెలియ జేస్తుంది . సంతోషం గా ఉంది మీలోని మానవతా కోణానికి .. బాధగా ఉంది ఆ చిన్నారుల దురదృష్టానికి

    ReplyDelete
    Replies
    1. రాధికా మీ స్పందనలకు ధన్యవాదములు.కానీ వారి దురదృష్టం పట్ల జాలి వద్దు, మీకు సాధ్యమైనంత సహకారం వారికి అందించండి.

      Delete
  3. ఈ బడుగుజీవుల బ్రతుకుల్లొ ఆకలికేకలేతప్ప, అన్నం ఎక్కడుంటుందీ, దొరికిన నాడే పండుగ,
    మనసంతా ఎదోగా అయిపోతుంది, ఇలాంటివి చదివితే,ఏమి చేయగలం దేవీ, ఓ రకంగా అస్సహాయులం,అసమర్దులమూ

    ReplyDelete
    Replies
    1. మనచేతనయినంత సహాయం అంటే అమ్మా!ఆకలి అని మన దగ్గరకు వచ్చిన వారికి మనం ఆకలి తీరుస్తున్నామా లేదా,దాన కర్ణుడిలా కాకపోయినా మన ప్లేటులోది తీసి పెడుతున్నామా లేదా అనే ఆలోచిస్తాను మీరజ్...ఈ మాత్రం మన చేతనయినందుకు మనకు ఈ అవకాశమైనా దేవుడు కలుగచేసినందుకు ఆనందిస్తాను.అయితేగియితే స్విస్స్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవాళ్ళు సిగ్గు పడాలి,మనం అసమర్ధులం కాదు,మరెంతో చేయాలనే ఆశతో,చేయలేక పోతున్నామే అనే బాధతో అలా అసహాయులమనే ఆలోచనలో ఉన్నాం అంతే.

      Delete