ఈ వ్యాపార ప్రకటన......చూశారా ?
ఈ వ్యాపార ప్రకటన చిన్నపిల్లల మనస్తత్వంపై ఎటువంటి ముద్ర వేస్తుంది ?పసిపిల్లల మనసులో విష బీజాలు నాటడం లేదా ఈ ప్రకటన ?
వ్యాపారాభివృద్ధికి చిన్నపిల్లల ఆలోచనలను కలుషితం చేయాలా ?
ఈ ప్రకటనను ఏ విధంగా ఆమోదించారు ?
తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఎంత ఆందోళన చెందుతారు ?
అన్నదమ్ముల మధ్యన బంధాన్ని బలహీన పరచడం లేదా ?
తండ్రికొడుకుల మధ్యన బంధాన్ని బలహీన పరచడం లేదా ?
కొన్ని గ్రాముల బరువు తేడాకి ఇల్లు వదిలివెళ్ళి పోవడాన్ని చూపెడతారా ?
ఆ వయసు పిల్లలకు ఉత్తరం రాసి పెట్టి పెద్దలను క్షోభ పెట్టడం ఎలానో నేర్పిస్తున్నారా ?
దీన్ని ఎవరైనా బలపరుస్తారా ?
నాకైతే ఈ ప్రకటనలో ఇన్ని నెగెటివ్ విషయాలు కనిపిస్తున్నాయి ,
మరి మీ స్పందన ?
********************
జై సమైఖ్యాంధ్ర..అన్నా హజారె...ఇలాంటి "గొప్ప గొప్ప" విషయాలకి తప్ప, ఇలాంటి "చిన్న చిన్న" విషయాలకి స్పందించె ఓపిక ఎవ్వరికీ ఉండదు స్రీదెవి గారూ!!
ReplyDeleteప్రసాద్ గారు,నా బ్లాగుకు స్వాగతమండి.ముందుగా మీ స్పందనలకు ధన్యవాదములు.చిన్న విషయాలను చూడలేనివారు,పరిష్కరించలేనివారు పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించగలరు....ఓపిక ఉండి స్పందించినవాటికి నిదర్శనమే మనముందున్న రావణకాష్టాల వంటి అపరిష్కృతాలు.
DeleteWell Said Sridevi garu.
DeleteSivaramaprasad sir,Welcome to my blog and Thanks for your hearten comment .
Deletevyaaparam yaava tappa anubhandala viluva leni vallu...
ReplyDeleteస్వరూప్ కుమార్ గారు నా బ్లాగుకు స్వాగతమండి.ముందుగా మీ స్పందనలకు ధన్యవాదములు.అవునవును,ఈ యాడ్ కి సర్టిఫికెట్ ఇచ్చినవారికి కూడా విలువల విలువ తెలియదేమో ....
Deleteఈ ప్రకటన నేను కొన్ని వారాల క్రితం మొదటి సారి చూసినప్పుడు నాకు ఇదే అనిపించింది శ్రీదేవి గారు, ఇలాంటి ప్రకటనలను అడ్డుకోవటానికి బహుశా చట్ట రిత్య ఎలాంటి నిబందనలు లేవనుకుంటా. నిబందనలు లేనంత మాత్రానా ఇలాంటి ప్రకటనలను ఉపెక్షించరాదు. మీరు దీనిపై నిరసన వ్యక్తం చేసి చాలా మంచి పని చేసారు, ఇలా కొందరైనా చేస్తే, ఇది వారి జనాల దృష్టికి వస్తే (అంటే ఇపాటికి రాలేదని కాదు, వచ్చినా అందరూ ఇలా పట్టించుకోరు) బహుశా ఇకముందు ఇలాంటి ప్రకటనలు తయారు చేసే అవకాశం తగ్గుతుంది.
ReplyDeleteమీరు మంచి పని చేసారు, మీ బ్లాగ్ ద్వార ఇంకొంత మంది ఈ దిశగా ఆలోచన చేసే అవకాసం ఉంది.
Green star గారు మీ ప్రోత్సాహకరమైన అభినందనకు ధన్యవాదములండి.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteరాంకుమార్ గారు నా బ్లాగుకు స్వాగతమండి.పిల్లలు మీరన్నంత మంచిగా చాక్లెట్ చూస్తారనుకోవడం చాలా పొరపాటండి,ఎందుకంటే శక్తిమాన్ సీరియల్ వచ్చినప్పుడే "పై నుండి దూకిన వాళ్ళున్నారు"పిల్లలకు మంచిచెడు తెలియదు, పిల్లలు అనుకరణలకు ఆకర్షితమౌతారు,చాక్లెట్ గూర్చికన్నా ఉత్తరం లో వాడు రాసిన భావాలు,తండ్రి పడే ఆవేదన ఎంత ఎక్కువగా చూపారో గమనించండి మరొక్కసారి....దీని బదులు అన్నదమ్ములు గొడవపడుతున్నట్లున్నా మామూలుగా ఉండేది సన్నివేశం సహజ సిద్ధంగా .