(ఈ చిత్రం జానీపాషా గారిది )
ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....
అమ్మానాన్నకు మేం బరువే అయినా ,
ఒకరికి ఒకరు తోడయ్యాము....
కూడూగుడ్డా కరువే అయినా ,
దొరికిన నాడు పంచుకు తిన్నాం....
గుండె బాధతో చెరువే అయినా ,
ఒకరిని ఒకరు ఓదార్చుకున్నాం......
మురికివాడలో నివశిస్తున్నా,
మనసులు మల్లెలా ఉంచుకున్నాం....
కడుపుకు ఆదరువు దొరకని నాడు ,
గుక్కెడు నీళ్ళు తాగి ఉన్నాం....
వేసవికాలం బోరుపంపును ,
డొక్కలు ఎగిరేలా కొడుతూ ఉన్నా....
పంపులో చుక్కా నీరూ రాదూ ,
మాకు చుక్కా చెమటా రాదు...
ఏడ్చిఏడ్చి కన్నీరంతా ఏరులైతే ,
మా ఒంట్లో ఇంకా నీరెక్కడిదీ....
పాప భారం మోసీ మోసీ ,
భూమాత నీరూ ఆవిరి అయితే ....
మాకింకా దిక్కెవరంటే ,
మేం ఒకరికి ఒకరు మేమే దిక్కు....
ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....
**********
ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....
అమ్మానాన్నకు మేం బరువే అయినా ,
ఒకరికి ఒకరు తోడయ్యాము....
కూడూగుడ్డా కరువే అయినా ,
దొరికిన నాడు పంచుకు తిన్నాం....
గుండె బాధతో చెరువే అయినా ,
ఒకరిని ఒకరు ఓదార్చుకున్నాం......
మురికివాడలో నివశిస్తున్నా,
మనసులు మల్లెలా ఉంచుకున్నాం....
కడుపుకు ఆదరువు దొరకని నాడు ,
గుక్కెడు నీళ్ళు తాగి ఉన్నాం....
వేసవికాలం బోరుపంపును ,
డొక్కలు ఎగిరేలా కొడుతూ ఉన్నా....
పంపులో చుక్కా నీరూ రాదూ ,
మాకు చుక్కా చెమటా రాదు...
ఏడ్చిఏడ్చి కన్నీరంతా ఏరులైతే ,
మా ఒంట్లో ఇంకా నీరెక్కడిదీ....
పాప భారం మోసీ మోసీ ,
భూమాత నీరూ ఆవిరి అయితే ....
మాకింకా దిక్కెవరంటే ,
మేం ఒకరికి ఒకరు మేమే దిక్కు....
ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....
**********
CHAKKAGA VUNDI
ReplyDeleteThank you Srinivas Reddygaaru.
Deleteబాధ్యతా రాహిత్యమైన తల్లిదండ్రులు ఒకరైనా ఇది చూస్తే బాగుంటుంది....శ్రీదేవిగారు చాలా హృద్యంగా ఉంది.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదములు.
Deleteపాప భారం మోసీ మోసీ భూమాత గుండె నీరంత ఆవిరైపోయి ....
ReplyDeleteఏడ్చిఏడ్చి న మా కన్నీరంతా ఏరులై .... ఒంట్లో ఇంకా నీరెక్కడిదీ!? మాకింక దిక్కెవరంటే .... మేము ఒకరికి ఒకరం .... రక్తబంధం లేని అన్నాదమ్ములం అంటాము.
బాగుంది పోస్టింగ్
అభినందనలు శ్రీదేవీ!
రైల్వే స్టేషన్,బస్టాండులలో పిల్లలు ఇలానే కనిపిస్తారు ,ఒకరి డొక్కలో ఒకరు ఒదిగి రాత్రి పూట నిదురించే తీరు మనసును కలచివేస్తుంది చంద్రగారు.
Delete