అదిగదిగో మా ఇల్లు ,
అందాల మా ఇల్లు ,
ప్రకృతిలోన గూడులా ,
మొక్కల నడుమ మొగ్గలా ,
నిశ్చల ప్రశాంత వనంలో ,
నిర్మలమైన రూపంలో ,
ఆకుపచ్చని వనంలో ,
ఆ వనకన్యల నడుమన ,
భ్రమరనాదములతో ,
ఆమని కోయిల కూతలతో ,
చల్లని మంచు బిందువులతో ,
భానుని లేత కిరణములతో ,
చల్లని పిల్లతెమ్మెరలతో ,
విరిసిన పూమొగ్గలతో ,
చిరు వెచ్చని సాయంసంధ్యలతో ,
తారాచంద్రుల లీలలతో,
ఆకాశం క్రింద సంతోషంగా ,
ఆనందంగా విహరించనా ,
ఆదమరచి నే నిదురించనా ,
అందమైన కలలు కననా .
*******
సఖియా...నిదురించవే..,
ReplyDeleteకలలోన ఆ సామాజిక రుగ్మతులను గూర్చి వివరించవే..:-))
ఆ రుగ్మతలను రూపుమాపలేకనే అందమైన ఇల్లును అడ్డం పెట్టుకుని పారిపోతున్నాను మీరజ్.
ReplyDeleteప్రకృతి సోయగాల నడుమ చల్లని పర్ణశాలా
ReplyDeleteమనసు బాధను పెకిలించే నిత్య నిర్మల కుటీరం
బహుశ.. మనషి మనసు కూడా ఆ లోగిలిలా నిర్మలంగా ఉండాలనే భావనను కొనియాడేటట్టు రాసినట్టున్నారు శ్రీదేవి గారు, మంచి మంచి ఆలోచనలు వ్యక్త పరిచారు మీరు. ది వే అఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ రియల్లీ మర్వెలస్ మాడం. కుడోస్ టు యు
శ్రీధర్ గారు ధన్యవాదములు.
Delete