ఎక్కడ నాకు రక్షణ దేవా ?
ఒకపరి నాకు వివరించు ....
కడుపున ఉన్నది ఆడ పిండమని తెలిపిన నాడు
అబార్షన్ పేరిట భ్రూణ హత్యను చేసేసారు...
జన్మించగానే ఆడపిల్లనని చెత్తకుప్పలో వేసేస్తే
కుక్కలకు నే ఆహారమై పోయాను......
పెరిగిన నన్ను బడికి పంపితే
బడిలో టీచర్ కీచకుడై వేటాడేసాడు.......
కాలేజీలోని ఉన్మాదిని నే ప్రేమించలేదని
కత్తిని గుండెలో దించేసాడు ...............
బస్టాపులోని పోకిరీని నే నిర్లక్ష్యం చేసానని
యాసిడ్ ముఖంపై పోసేసాడు..........
ఇచ్చిన కట్నం చాల్లేదని
అత్తింటివారు నను అగ్నికి ఆహుతి చేసేసారు....
కట్టుకున్నవాడు అనుమానంతో
కత్తితో నరికి వేసేసాడు.....
బస్సులో ప్రయాణం చేస్తుంటే
కామాంధులు వాడుకు తోసేసారు.......
ప్రేమించిన వాడిని నమ్మినందుకు
మరొకడికి వాడు అమ్మేసాడు......
ప్రేమించిన వాడిని చేసుకున్నందుకు
పరువు కోసం అమ్మానాన్నలే ఉరి వేసేసారు........
తాగిన మైకంలో వావివరుస మరచి
కన్నకూతురి పైనే అత్యాచారం చేసేసాడు....
దేవుని నామం చాటున ఆశ్రమాల్లో
కామాంధులు మాకాం వేసేసారు.....
నన్ను పుట్టించే ముందర నా రక్షణ
ఒకపరి నాకు చూపించు ....
నా పై నీవు దయ ఉంచి ఒంటరిగా
ఈ సమాజంలో నన్ను వదలొద్దు........
***************
ఒకపరి నాకు వివరించు ....
కడుపున ఉన్నది ఆడ పిండమని తెలిపిన నాడు
అబార్షన్ పేరిట భ్రూణ హత్యను చేసేసారు...
జన్మించగానే ఆడపిల్లనని చెత్తకుప్పలో వేసేస్తే
కుక్కలకు నే ఆహారమై పోయాను......
పెరిగిన నన్ను బడికి పంపితే
బడిలో టీచర్ కీచకుడై వేటాడేసాడు.......
కాలేజీలోని ఉన్మాదిని నే ప్రేమించలేదని
కత్తిని గుండెలో దించేసాడు ...............
బస్టాపులోని పోకిరీని నే నిర్లక్ష్యం చేసానని
యాసిడ్ ముఖంపై పోసేసాడు..........
ఇచ్చిన కట్నం చాల్లేదని
అత్తింటివారు నను అగ్నికి ఆహుతి చేసేసారు....
కట్టుకున్నవాడు అనుమానంతో
కత్తితో నరికి వేసేసాడు.....
బస్సులో ప్రయాణం చేస్తుంటే
కామాంధులు వాడుకు తోసేసారు.......
ప్రేమించిన వాడిని నమ్మినందుకు
మరొకడికి వాడు అమ్మేసాడు......
ప్రేమించిన వాడిని చేసుకున్నందుకు
పరువు కోసం అమ్మానాన్నలే ఉరి వేసేసారు........
తాగిన మైకంలో వావివరుస మరచి
కన్నకూతురి పైనే అత్యాచారం చేసేసాడు....
దేవుని నామం చాటున ఆశ్రమాల్లో
కామాంధులు మాకాం వేసేసారు.....
నన్ను పుట్టించే ముందర నా రక్షణ
ఒకపరి నాకు చూపించు ....
నా పై నీవు దయ ఉంచి ఒంటరిగా
ఈ సమాజంలో నన్ను వదలొద్దు........
***************
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశ పడకుమా, నిజం మరచి నిదురపోకుమా! కత్తి ఝుళిపించు ఆత్మ రక్షణ ప్రాధమిక హక్కు.
ReplyDeleteశర్మగారు మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteఎవరో ఏంటండి మీకు మీరే రక్షణ
ReplyDeleteరాణీగారు మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteనిన్ను పుట్టించినందునే మిగతా సృష్టి పుడుతుందమ్మా..,
ReplyDeleteనీ విలువ తెలీని ఈ లోకములో, నీ ప్రేమ తెలీని ఈ మనుషుల్లో ఎక్కువ కాలం ఉండలేవు.
దేవీ...మనస్సు ఎదోగా అయిపోయి కామెంట్ ఆలస్యం అయింది.
"విలువలు"అంటే వస్తువుల విలువలే తెలుసు నేటి సమాజంలో,నైతికత అంటేనే తెలియని నాడు నైతిక విలువలకు ఇక కాలం చెల్లినట్లే మీరజ్,అందరికీ పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పే నేను ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించలేక ఇలా ఆవేదన వ్యక్తం చేసాను.
Deleteఅర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా ఇంటికి రాగలగడం మాట అటుంచి పట్టపగలే ప్రమాద సంకేతం .... నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ప్రతి మనిషి మరో మనిషి స్వేచ్చకు భంగం కలిగించే ఇలాంటి సంఘటనలు మనం ఆటవిక సమాజం లో ఉన్నామా అనిపిస్తూ
ReplyDeleteఎక్కడ నాకు రక్షణ ప్రజాస్వామ్యమా? అన్నట్లుంది
బాగా రాసావు శ్రీదేవీ!
స్వాతంత్ర్యం రాక మునుపు పరాయి వాడు మనల్ని హింసిస్తే ,వచ్చిన తర్వాత మనల్ని మనమే హింసించుకుంటున్నాము,ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చేసిందిగా మరి ....స్వాతంత్ర్యం అనే మాటను అపహాస్యం చేసేసారు.
Delete