Tricks and Tips

Sunday, March 23, 2014

శుభోదయం _/\_

ఆ భానుని లేత కిరణములు
మా ముంగిలి చేరగ స్వాగతమిస్తూ....
మా తరులు కురిపించిన విరివానల జల్లులతో
వేసిన సుతిమెత్తని పూదారి మెచ్చి విచ్చేయుచున్నాడా...
మా గృహము పావనము చేయదలచి లోలోనికి
ఆ బాలభానుడు మా ఆతిథ్యము స్వీకరించగా !

***************
 

6 comments:

  1. దేవీ, అందమైన ముంగిట భానుడే విచ్చేస్తే.....,అంతకంటే గొప్ప అతిది ఇంకెవరు కావాలి,
    భావుకత చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రొద్దున్నే తలుపు తీయగానే ఇటువంటి దృశ్యం కనబడితే మనసు ఎంతగా పొంగిపోతుందో కదా...మీ అభినందనలకు ధన్యవాదములు మీరజ్.

      Delete
  2. ఎంత అందమైన ఆలోచన శ్రీదేవి గారూ .. మీ భావుకత తో మా మనసు కి విందు నిచ్చారు

    ReplyDelete
    Replies
    1. హమ్మా!పోన్లే కాఫీ ఇద్దామనుకుంటే విందు అంటారా......?
      ధన్యవాదములు రాధిక.

      Delete
  3. ఆ బాలభానుడు మా ఆతిథ్యము స్వీకరించగా అన్న నీ వేడికోలు కు ముందు .... ఒక సందర్బం, లేక చిన్న విందు ప్రోగ్రాం పెట్టుకుంటే స్నేహితులు సన్నిహితులు కూడా ఆ ఆనందంలో పాలుపంచుకుంటారు కదా!

    చాలా బాగుంటుంది ఆలోచన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ సూచన బాగుంది. చాలా సంతోషం,మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete