చెంతన నీవు నిలబడగ
ఆనందం అనిర్వచనీయమెగ ,
నీ ఉనికే ప్రశాంత చిత్తమని
నా మనసే గుసగుసలాడగ ,
జీవన సమస్య తో"రణాలే"
దూది పింజెలై తేలిపోవగ ,
ఒకరికై ఒకరు నిలిచిన మనలో
భేదాభిప్రాయం మొలకెత్తగ ,
మనమిరువురం వేదనగా
వేదనతోటి వేరవగ ,
మన మనసులకైన గాయం
ముల్లులా గుచ్చి బాధించగ ,
మన హృదయావేదన కొలిమిలా
నిప్పుల సెగనే రగిలించగ ,
మన అంతరంగాల అంతర్మధనం
అనంత సాగర ఘోషవగ ,
ఆవేశం వీడిన మన ఆలోచనలు
మననొకటైపొమ్మని ఆదేశించగ ,
గుండెలో భారం దిగిపోయి
చేతులు ముందుకు చాచి సాగగ ,
కాళ్ళు తడబడుతు ఎదురెదురుగ
నడక వడివడిగా సాగగ ,
చేతులు చేతులు కలిసిపోగ
ఆనందాశ్రువులు వర్షించగ ,
మనసులు ఒకటిగ చేరగ
బాసలనెన్నో చేసుకొనగ ,
ఆనందం అనిర్వచనీయమెగ ,
నీ ఉనికే ప్రశాంత చిత్తమని
నా మనసే గుసగుసలాడగ ,
జీవన సమస్య తో"రణాలే"
దూది పింజెలై తేలిపోవగ ,
ఒకరికై ఒకరు నిలిచిన మనలో
భేదాభిప్రాయం మొలకెత్తగ ,
మనమిరువురం వేదనగా
వేదనతోటి వేరవగ ,
మన మనసులకైన గాయం
ముల్లులా గుచ్చి బాధించగ ,
మన హృదయావేదన కొలిమిలా
నిప్పుల సెగనే రగిలించగ ,
మన అంతరంగాల అంతర్మధనం
అనంత సాగర ఘోషవగ ,
ఆవేశం వీడిన మన ఆలోచనలు
మననొకటైపొమ్మని ఆదేశించగ ,
గుండెలో భారం దిగిపోయి
చేతులు ముందుకు చాచి సాగగ ,
కాళ్ళు తడబడుతు ఎదురెదురుగ
నడక వడివడిగా సాగగ ,
చేతులు చేతులు కలిసిపోగ
ఆనందాశ్రువులు వర్షించగ ,
మనసులు ఒకటిగ చేరగ
బాసలనెన్నో చేసుకొనగ ,
ఒకరికొకరు లేని జీవితం
మనం ఊహగనైనా ఊహించొద్దు ,
అనురాగంతో ఆజన్మాంతం
ఒకరికొకరు లేని జీవితం
ReplyDeleteమనం ఊహగనైనా ఊహించొద్దు ,
అనురాగంతో ఆజన్మాంతం
జన్మజన్మలకు పునాదులు వేద్దాం .బాగుంది శ్రీదేవిగారు.
హిమజా ధన్యవాదములు.
DeleteChaalaa baagundi.sridevi gaaroo..
Deleteఎగిసే అలలు....gaaru thank you .
DeleteLast 4 lines super sridevigaru
ReplyDeleteమీకు అంతగా నచ్చడం చాలా సంతోషం గాయిత్రీగారు .
Delete