Tricks and Tips

Thursday, February 27, 2014

నాసిక ధగధగ మెరిసింది......


తారలనన్నీ తెద్దామని,
ఆకాశతీరం చేరాను.
ఆశగ అన్నీ కోద్దామని,
తారాతీరం చేరాను.

 మబ్బుల మాటున తారలు నాతో ,
దాగుడుమూతలు ఆడాయి.
ఆటలో నేనే గెలిచాను,
 ఓ తారను చేతిలో బంధించాను.

అత్యాశకు జరిగా దూరంగా,
దొరికిన దానిని దగ్గరగా......
పొదుపుకుని ఆశలతీరం చేరాను,
అవని పథం పట్టాను.

అందాల మరదలి కన్నులు మూశా,
ఆ తారను ఆమె చేతిలో ఉంచా...
కన్నులు తెరిచి చూసింది,
నాసిక మీద ఉంచింది.

 నాసిక ధగధగ మెరిసింది,
మరదలు సిగ్గుతో కళ్ళు మూసింది.
నిశిరాతిరిలో మెరిసే తార,
నిరతము నాతో నిలిచే సితారతో. 

*******

4 comments:

  1. పోన్లెండి ఒక్కటైనా తేగలిగాడు ఎంత మంచి బావో better luck next time

    ReplyDelete
    Replies
    1. ఒక్కటైనా తేకపోతే మాట్లాడనని ఉంటుంది మరదలు,అందుకే ఉన్నది
      కూడా పోగొట్టుకుంటానేమోనని అత్యాశకు పోక దొరికిన దానితో
      సంతోషంగా వచ్చేసి ఉంటాడు హరితా ...

      Delete
  2. తారను ఆమె చేతిలో ఉంచా .... కన్నులు తెరిచి చూసింది,
    నాసిక మీద ఉంచింది. నాసిక ధగధగ మెరిసింది.
    ..... అతి చక్కని భావన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. నాకు ముక్కుపుడక తారంత అందంగా అనిపిస్తుంది చంద్రగారు....మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete