Tricks and Tips

Tuesday, February 25, 2014

అహ్హహ్హ.......నా భావం నా ఇష్టం....


నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
నడచి వెళ్ళొచ్చు కదా, కొంచెం ఒళ్ళయినా తగ్గుతుంది......

నేను  సైకిల్ పై వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
పనీపాటా లేని వాడల్లా బైక్ విన్యాసాలు
చేయడమే ఏం బాగుపడతారో, ఏమిటో....  

నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఒక్కడు ఓడంత కారులో లింగులింగుమంటూ వెళుతూ
ట్రాఫిక్ , కాలుష్యం పెంచడం ఎంత బాధ్యతా రాహిత్యం....

నేను కారులో వెళ్ళేటప్పుడు
విమానంలో  వెళ్ళే వాళ్ళను చూసి ,
అమ్మబాబులు సంపాదించి పడేస్తే
విమానమెక్కి ఒక్కొక్కడూ తైతక్కలాడుతున్నాడు.....

నేను విమానంలో వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళింకేం ఎదుగుతారు.......

నేను కారులో వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళసలు ఎదుగుతారా.......

నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
వీళ్ళెప్పు
డు ఎదుగుతారో , ఏమిటో......

నేను నడిచి వెళ్ళేటప్పుడు
నా వంక చూసిన వారితో అన్నాను ,
 "నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది" అని .



***********

14 comments:

  1. ఇప్పుడుం దండీ శ్రీదేవి గారూ
    భూమి గుండ్రంగా హహహ..

    ReplyDelete
    Replies
    1. లేదు....లేదు నా భావం అది కాదు జానీగారు,నేను తక్కువ స్థాయిలో ఉన్నాప్పుడు ఎలా స్పందించాను....అదే నేను పై స్థాయికి చేరుకున్నాక ఎలా స్పందిస్తున్నాను.....అంతా నా ఇష్టం,అన్నీ నా ఇష్టం....

      Delete
  2. వహ్వా...ఇలా చెప్పాలి, ఎవరైనా మనల్నిక ప్రశ్నిస్తారా,
    మా దేవి దగ్గర ప్రతి ప్రశ్నకీ జవాబుందోచ్...:-))

    ReplyDelete
    Replies
    1. ఏయ్ ...జవాబులండీ......జవాబులేయ్ .......

      Delete
  3. ఏమంటాం చెప్పండి.....మీ భావాలతో ఏకీభవించి నడక సాగించడం తప్ప:-)

    ReplyDelete
    Replies
    1. అవునవును ఒక్కొక్కసారి మనమందరం ఏక తాటి మీద నడిస్తేనే గానీ జనం మనకి భయపడతారు....అప్పుడప్పుడు భయపెట్టాలి తప్పదు పద్మార్పితగారూ,మీరు నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములు.

      Delete
  4. అవును మరి అంతా నా ఇష్టం :-) :-) .....

    ReplyDelete
    Replies
    1. అవును హరితా అవును....మీ వద్దకు వచ్చేసరికి మాత్రం అంతా మీ ఇష్టం.....

      Delete
  5. Chepina taruvata eka nadavalsindha.

    ReplyDelete
    Replies
    1. గాయత్రీగారు నా బ్లాగుకు వస్తూవస్తూనే నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములు.

      Delete
  6. Replies
    1. Sarmagaaru,majority (comments) is authority.So we won.

      Delete
  7. అందరూ నాలా ఎప్పుడు బ్రతుకుతారో .... ఎప్పుడు నేర్చుకుంటారో బ్రతకడం ....
    అహ్హహ్హ ....... నన్ను చూసి నేర్చుకోవచ్చుగా
    ఎంత అందమైన భావమో ఎంత ఇష్టం గానో .... బాగుపడతారని జీవన సూక్ష్మాన్ని చెబుతున్నా .... అన్నట్లు
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ విశ్లేషణ చాలా బాగుంది. ధన్యవాదములు.

      Delete