Tricks and Tips

Tuesday, February 4, 2014

ప్రేమవు నీవైతే ......

మేఘం నీవైతే - వర్షం నేనవుతా
చంద్రుడు నీవైతే - వెన్నెల నేనవుతా

సుమము నీవైతే - సువాసన నేనవుతా
ఫలము నీవైతే - మాధుర్యం నేనవుతా

వేణువు నీవైతే - నాదం నేనవుతా
వీణవు నీవైతే - తీగను నేనవుతా

గాయని నీవైతే - గానం నేనవుతా
కవివి నీవైతే - కలమును నేనవుతా

నర్తకి నీవైతే - నాట్యం నేనవుతా
అందెలు నీవైతే - మువ్వను నేనవుతా

శిల్పివి నీవైతే - ఉలిని నేనవుతా
శిల్పం నీవైతే - జీవకళను నేనవుతా

శ్వాసవు నీవైతే - ప్రాణం నేనవుతా
వక్తవు నీవైతే - శ్రోతను నేనవుతా

మాటవు నీవైతే - భావం నేనవుతా
పాటవు నీవైతే - పల్లవి నేనవుతా

ప్రేమవు నీవైతే - పెళ్ళిని నేనవుతా
పెళ్ళికూతురు నీవైతే - పెళ్ళికొడుకును నేనవుతా


********


12 comments:

  1. బాగుంది, దేవీ...బాషవు నీవైతే భావం నేనవుతా....:-))

    ReplyDelete
    Replies
    1. స్పందన నీవైతే - ధన్యవాదం నేనవుతా.

      Delete
  2. చాలా బాగుంది (పాత్రవు నీవైతే పదార్ధం నేనవుతా :-) :-) గుర్తొచ్చిందా )

    ReplyDelete
    Replies
    1. కొంచెం అటువంటిదే అనుకుంటా హరిత......

      Delete
  3. Replies
    1. మీ ఆస్వాదనకు ధన్యవాదములు ఫణిగారు.

      Delete
  4. అస్తిత్వం ఆత్మ లా పదమూ భావం లా ....
    ప్రియురాలు ఒకరైతే మౌన హృదయారాదన రాగం ఇంకొకరైనట్లు ....
    భావరాగం వినిపిస్తుంది శ్రీదేవీ!
    అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందన భావ స్పందనకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete
  5. ప్రేమ అనిర్వచనీయమైనది శ్రీదేవి గారు .. ఎంత వర్ణించిన ఇంకా మిగిలి పోతూనే ఉంటుంది .. మీ కవిత బావుంది

    ReplyDelete
    Replies
    1. అవును రాధిక,మిగిలితేనేకదా మన తర్వాత తరాలు ఆస్వాదించేది...ఆనందించేది.మీ స్పందనలకు ధన్యవాదములు.

      Delete
  6. భావం, భాష్యం రెండూ ఒకరికొకరు.....

    ReplyDelete
    Replies
    1. వేరైతే మనలేవు కదా ! పద్మగారు అభినందనలకు ధన్యవాదములు .

      Delete